Site icon HashtagU Telugu

Kajal Agarwal Baby: అమ్మతనాన్ని ఆస్వాదిస్తున్న కాజల్…కొడుకు ఫొటోలు పోస్ట్ చేసిన బ్యూటీ.!!

kajal baby

kajal baby

టాలీవుడ్ ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ అమ్మతనాన్ని ఆస్వాదిస్తుంది. ఈ మధ్యే కాజల్ మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. కాజల్, గౌతమ్ కిచ్లుల కొడకుకు నీల్ కిచ్లూ అనే పేరు పెట్టారు. మదర్స్ డే సందర్భంగా కాజల్తన బిడ్డతో దిగిన ఫొటోను ఫ్యాన్స్ కు షేర్ చేసింది. నెట్టింట్లో కాజల్ పోస్టు చేసిన ఫొటో వైరల్ అవుతోంది.

నువ్వు నాకు ఎంత విలువైనవాడివో…ఎంత ప్రత్యేకమో నీకు చెప్పాలనుకుంటున్నా…అంటూ ఇన్ స్టాలో పోస్టు పెట్టింది. నిన్ను నా చేతుల్లోకి తీసుకున్న ఆ క్షణం…నీ చిట్టి చేతులను నా చేత్తో పట్టుకున్న ఆ క్షణం…నీ వెచ్చని శ్వాస నాకు తగిలింది. అప్పుడే నీ అందమైన కళ్లను చూశా..నిన్ను ప్రేమిస్తున్నానని నాకు తెలుసంటూ ఆమె భావోద్వేగభరితంగా రాసుకొచ్చింది. కాజల్ పోస్టుకు ఆమె సోదరి నిషా అగర్వాల్, సమంత, హన్సిక, కరిష్మా మెహతా, నీరజా కోన వంటి హీరోయిన్లు కామెంట్స్ పెట్టారు. కాజల్ చాలా అందంగా ఉన్నవంటూ పోస్టు పెట్టారు.