Site icon HashtagU Telugu

Kajal Glamour : తల్లి అయినా తగ్గేదేలే.. గ్లామర్ పాత్రలకు కాజల్ సై!

Kajal Aggarwal

Kajal Aggarwal

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆమె ఏప్రిల్‌లో ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. బేబీకి నీల్ కిచ్లు అని పేరు పెట్టింది. ఆమె ఇప్పుడు స్క్రీన్ పై కనిపించాలని ఆసక్తి చూపుతోంది. ప్రస్తుతం తాను రెండు స్క్రిప్ట్‌లను వింటున్నానని అంటోంది. ఫీమేల్ సెంట్రిక్ మూవీ కోసం ఓ దర్శకుడు సంప్రదించగా, కాజల్ నో చెప్పినట్టు టాక్. తల్లి అయిన తర్వాత కూడా ఆమె గ్లామర్ పాత్ర కోసం వేచిచూస్తున్నట్టు తెలుస్తోంది.

ప్రత్యేక పాట కోసం కాజల్ ను ‘పుష్ప 2’ టీమ్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్త నిజం కానప్పటికీ, ఆమె ఫ్యాన్స్ మాత్రం చాలా సంతోషపడ్డారు. కాజల్ క్రేజీ ప్రాజెక్ట్‌లో భాగం కావడం గ్లామర్ గా కనిపించే అవకాశం ఉండటంతో అలాంటి పాత్రలకే ఓకే చెబుతున్నట్టు తెలుస్తోంది. కమ్ బ్యాక్ కు బాగా హెల్ప్ అవుతున్న యోచనలో ఉందట. మరి రానున్న రోజుల్లో ఈ చందమామ ఏ ప్రాజెక్ట్ ఆఫర్ చేస్తుందో వేచి చూద్దాం.