సౌత్ స్టార్ హీరోయిన్ గా ఒకప్పుడు స్టార్ హీరోలందరితో నటించిన కాజల్ ఆఫ్టర్ మ్యారేజ్ తన దూకుడు తగ్గించిందని చెప్పొచ్చు. అదేంటో కొంతమంది భామలు పెళ్లైనా సరే అసలేమాత్రం గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తారు. పెళ్లైన హీరోయిన్స్ కేవలం ఫిమేల్ సెంట్రిక్ సినిమాలే చేస్తారన్న టాక్ ఉంది. కానీ తమిళంలో నయనతార (Nayanatara) కానీ బాలీవుడ్ లో అలియా భట్, దీపికాలు కానీ పెళ్లైనా కూడా కమర్షియల్ సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్నారు.
ఐతే సౌత్ లో సమంత ఆఫ్టర్ మ్యారేజ్ తన ఫాం కొనసాగించినా డైవర్స్ ఇంకా మయోసైటిస్ వల్ల ఆమె కెరీర్ మీద ఎఫెక్ట్ పడింది. ఐతే కాజల్ (Kajal Agarwal) కి ఫ్యామిలీ లైఫ్ హ్యాపీగానే ఉంది. కానీ సినిమా కెరీర్ మాత్రం ఆశించిన స్థాయిలో లేదు. తెలుగులో ఆమెకు హీరోయిన్ ఛాన్సులు పెద్దగా రావట్లేదు. ఇక ఈమధ్యనే లేడీ ఓరియెంటెడ్ సినిమాగా చేసిన సత్యభామ కూడా సోసోగానే అనిపించింది.
ఇదిలాఉంటే తను చేసిన సినిమాల్లో కూడా కాజల్ కు అనుకోని విధంగా ఎడిటింగ్ లో తన పాత్ర పోతుంది. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య (Acharya) సినిమాలో కాజల్ నటించింది. కానీ ఆ సీన్స్ సరిగా రాలేదని కొరటాల శివ సినిమా నుంచి తీసేశారు. ఆచార్య లో అలా కాజల్ నటించినా వెండితెర మీద కనిపించలేదు. ఇక లేటెస్ట్ గా కాజల్ ఇండియన్ 2 లో కూడా నటించింది. కానీ ఇండియన్ 2లో కూడా ఆమె పాత్ర ఉండదని తెలుస్తుంది.
ఇండియన్ 3 సినిమా కోసం ఇండియన్ 2 (Indian 2) లో కాజల్ పాత్రని స్కిప్ చేశారట. అంటే కాజల్ చేసిన సీన్స్ అన్నీ ఇండియన్ 3 లో ఉంటాయన్నమాట. కమల్ హాసన్ (Kamal Hassan) కాజల్ మిడిల్ ఏజ్ రోల్ లో కనిపిస్తారు. తప్పకుండా కాజల్ కి ఇండియన్ 3 కెరీర్ కి బూస్టింగ్ ఇస్తుందని చెప్పొచ్చు. ఈలోగా అమ్మడు సోలో సినిమాల కోసం కూడా గట్టిగానే ట్రై చేస్తుంది.