Site icon HashtagU Telugu

Ranya Rao : బంగారం స్మగ్లింగ్ చేసి అరెస్టయిన హీరోయిన్.. దుబాయ్ నుంచి అక్రమంగా 15 కిలోల బంగారం..

Kaannada Actress Ranya Rao Arrested in Gold Smuggling Case

Ranya Rao

Ranya Rao : తాజాగా కన్నడ హీరోయిన్ రాన్యా రావుని అరెస్ట్ చేసారు. రాన్యా.. మాణిక్య, వాఘా, పటాకి.. పలు సినిమాల్లో నటించింది. ఇటీవల రాన్యా రెగ్యులర్ గా దుబాయ్ వెళ్లొస్తున్నట్టు ఎయిర్పోర్ట్ అధికారులు గమనించారు. గత 15 రోజుల్లో నాలుగు సార్లు ఆమె దుబాయ్ కి వెళ్ళొచ్చింది. దీంతో ఆమెపై నిఘా పెట్టారు ఎయిర్పోర్ట్ అధికారులు.

తాజాగా బెంగుళూరు విమానాశ్రయంలో రాన్యా దుబాయ్ నుంచి తిరిగొస్తుండగా డైరెక్టరేట్ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (DRI) అధికారులు ఆమెని విచారించి, చెక్ చేయగా ఆమె వద్ద 15 కిలోల బంగారం దొరకడంతో ఆమెని అదుపులోకి తీసుకున్నారు.

డైరెక్టరేట్ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు మీడియాతో మాట్లాడుతూ.. ఆమె ఇటీవల రెగ్యులర్ గా దుబాయ్ కి వెళ్లొస్తుంది. దీంతో ఆమెపై నిఘా పెట్టాం. ఆమె ఎలాంటి అనుమానం రాకుండా బంగారపు బిస్కెట్స్ ని బట్టల్లో దాచి తీసుకొచ్చేది. ఆమె కర్ణాటకకు చెందిన ఓ పోలీస్ అధికారి బంధువని తెలుస్తుంది. మేము ఆమెని ప్రశ్నించగా తాను డీజీపీ కుమార్తె అని, ఆమెని డ్రాప్ చేయడానికి పోలీసులకు కాల్ చేస్తాను అని చెప్పినట్లు తెలిపారు.

దీంతో DRI అధికారులు ఆమెని అదుపులోకి తీసుకొని ఆమెకు పోలీస్ అధికారికి సంబంధం ఏంటి? స్మగ్లింగ్ లో ఎవరి ప్రమేయం ఉంది అన్న కోణంలో విచారిస్తున్నారు.

 

Also Read : Rahul Ramakrishna : సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్న నటుడు.. కొన్నాళ్లపాటు ఇంటర్నెట్ కు దూరంగా ఉంటా అంటూ..