Kiran Abbaram Ka : హిట్ , ప్లాప్ లతో సంబంధం లేకుండా ప్రేక్షకుల ముందుకు వరుస సినిమాలతో వస్తున్న హీరో కిరణ్ అబ్బవరం (kiran Abbavaram ) కిరణ్ ‘హిట్’ కొట్టేసాడోచ్
). రాజా వారు రాణి గారు (Raja varu Rani Garu) సినిమాతో హీరోగా తొలి సినిమాతోనే అలరించిన కిరణ్.. ఎస్.ఆర్ కళ్యాణమండపం తో తన మార్క్ చూపించాడు. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఈమధ్యలో చేసిన సినిమాల్లో వినరో భాగ్యము విష్ణు కథ తప్ప మరో సినిమా ఆడలేదు. అయినా సరే మనోడు వెనక్కి తగ్గలేదు.
తాజాగా ‘క’ (Ka) అంటూ క్రేజీ సినిమాతో ఈరోజు దీవాలి సందర్బంగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాను సుజిత్, సందీప్ అనే దర్శక ద్వయం డైరెక్ట్ చేసారు. ఈ సినిమా తాలూకా ప్రమోషన్స్, టీజర్ , ట్రయిలర్ ఇలా ప్రతిదీ సినిమా పై ఆసక్తి పెంచడం తో సినిమా ఎలా ఉండబోతుందో అనే అంచనాలు పెరిగాయి. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లే సినిమా తెరక్కిందని ఆడియన్స్ అంటున్నారు. ఓ ఊరిలో అమ్మాయిలు మిస్సవడానికి కారణమెవరు? ఈ కేసులకు హీరోకు సంబంధమేంటి అనే క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో ‘క’ తెరకెక్కింది. డైరెక్టర్లు సుజీత్-సందీప్ కథను నడిపిన తీరు, ఇంటర్వెల్, కర్మ సిద్ధాంతంతో ముడిపెట్టిన క్లైమాక్స్, BGM, కిరణ్ నటన ఇలా ప్రతిదీ ఆకట్టుకున్నాయని అంటున్నారు. చివరి 15 నిమిషాల్లో మలుపులు థ్రిల్ చేస్తాయని చెపుతున్నారు. ఫస్టాఫ్ కొంచెం స్లోగా ఉన్నప్పటికీ, స్క్రీన్ప్లేపై ఇంకాస్త దృష్టిపెడితే బాగుండేదని..కానీ ఓవరాల్ గా సినిమా సూపర్ హిట్ అంటున్నారు.
Read Also : kiran abbavaram ka