Site icon HashtagU Telugu

KA Paul : ఓపెన్‌హైమర్ సినిమా చూసిన KA పాల్.. లైఫ్‌లో మొదటి సారి సినిమా చూశాను అంటూ..

KA Paul Watched Oppenheimer Movie he says this is the first movie watched in his life

KA Paul Watched Oppenheimer Movie he says this is the first movie watched in his life

హాలీవుడ్(Hollywood) స్టార్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్(Christopher Nolan) ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన భారీ సినిమా ఓపెన్‌హైమర్(Oppenheimer). సెకండ్ వరల్డ్ వార్ లో మొదటి అణుబాంబుని తయారు చేసిన కథ గురించి బయోపిక్ గా తెరకెక్కింది ఈ సినిమా. క్రిస్టోఫర్ నోలన్ సినిమాలకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఓపెన్‌హైమర్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఏర్పడింది. జులై 21న రిలీజయిన ఈ సినిమా భారీ విజయం సాధించి ఇప్పటికే దాదాపు 2000 కోట్ల కలెక్షన్స్ ని వసూలు చేసింది.

తాజాగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు KA పాల్(KA Paul ప్రసాద్ ఐమాక్స్ లో ఓపెన్‌హైమర్ సినిమా చూశారు. ఈ సినిమా చూసిన అనంతరం మీడియాతో మాట్లాడారు పాల్.

KA పాల్ మాట్లాడుతూ.. ఓపెన్ హైమార్ సినిమా చాలా బాగుంది. నా జీవితంలోనే ఎప్పుడూ సినిమా చూడలేదు. మొదటి సారి సినిమా చూశాను. ఈ సినిమాలో మంచి సందేశం ఉంది. ఈ సినిమా అందరూ చూడాలి. యుద్ధాలతో ఏది గెలవలేరు, శాంతితో దేశాలను గెలవాలి. న్యూ క్లియర్ బాంబ్ లతో ఇరాక్, ఇరాన్, అమెరికా దేశాల్లో లక్షల మంది చనిపోయారు. శాంతితో ఈ ప్రపంచాన్ని కాపాడాలి. యుద్ధాలు , బాంబులతో దేశాలు సర్వ నాశనం అవుతాయి అని తెలిపారు. దీంతో మొదటిసారి సినిమా చూశాను అని KA పాల్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.