కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన రీసెంట్ మూవీ క సూపర్ హిట్ సొంతం చేసుకుంది. ఈ సినిమాను సుజిత్, సందీప్ డైరెక్ట్ చేశారు. ఈ ఇద్దరు సినిమాను చాలా బాగా హ్యాండిల్ చేశారు. క చూసిన వారంతా క్లైమాక్స్ ని ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. ఐతే క సినిమాలో హీరోయిన్ గా నటించిన నయన్ సారిక (Nayan Sarika) టాలీవుడ్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.
నయన్ సారిక తెలుగులో మొదటి సినిమా ఆనంద్ దేవరకొండతో గం గం గణేశా సినిమా చేసింది. ఆ సినిమా పెద్దగా ఆడకపోయినా అమ్మడికి నార్నే నితిన్ హీరోగా తెరకెక్కిన ఆయ్ ఛాన్స్ వచ్చింది. ఆ సినిమా మంచి సక్సెస్ సాధించడంతో లేటెస్ట్ గా కతో లక్కీ ఛాన్స్ దక్కించుకుంది. క హిట్ తో నయన్ సారిక ఖాతాలో మరో హిట్ పడింది.
నయన్ సారిక లక్కీ హ్యాండ్..
చేసిన 3 సినిమాల్లో రెండు హిట్లు కొట్టడంతో పాటుగా నయన్ సారిక లక్కీ హ్యాండ్ అంటున్నారు. ఆయ్ (Aay), క రెండు డిఫరెంట్ సినిమాలు కాబట్టి రెండు సినిమాలతో డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ అందుకుంది అమ్మడు. రెండు హిట్లు పడ్డాయి కాబట్టి అమ్మడు ఇక మీదట సెలెక్టెడ్ ఆప్షన్స్ మాత్రమే అన్నట్టు చేస్తుందని చెప్పొచ్చు.
అంతేకాదు రెండు హిట్లు వెంట వెంటె పడ్డాయి కాబట్టి అమ్మడు అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చేందుకు కూడా నిర్మాతలు వెనకాడరని చెప్పొచ్చు. క (KA) హిట్ తో నయన్ నెక్స్ట్ సినిమా ఏం చేస్తుంది ఆ సినిమా ఫలితం పై ఆడియన్స్ ఎగ్జైట్ మెంట్ కనబడుతుంది.
Also Read : Prabhas : సలార్ 2 అటకెక్కినట్టేనా.. హోంబలె నిర్మాణలో ప్రభాస్ మరో సినిమా..?