కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ‘క’ (KA) మూవీ రూ.50 కోట్ల క్లబ్ లో చేరి అసలు సిసలైన హిట్ అందుకుంది. కథలో దమ్ము ఉండాలే కానీ కాస్ట్ & క్రూ తో సంబంధం లేదని మరోసారి ‘క’ మూవీ నిరూపించింది. ఈ మధ్య పాత డైరెక్టర్ల కంటే కొత్త డైరెక్టర్లు సరికొత్త కథలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు, నిత్యం మూస కథలు చూసి చూసి విసిగిపోయి..అసలు థియేటర్స్ కు రావడం మంసేసారు. ఈ తరుణంలో యంగ్ టాలెంట్ డైరెక్టర్స్ కు హీరోలు ఛాన్స్ ఇస్తూ..అదరగొడుతున్నారు
ఇక యువ హీరోల్లో కొత్త ప్రయత్నాలతో అలరిస్తూ సత్తా చాటుతున్న వారిలో కిరణ్ అబ్బవరం ఒకరు. రాజా వారు రాణి గారు (Raja varu Rani Garu) సినిమాతో హీరోగా తొలి సినిమాతోనే అలరించిన కిరణ్ ఎస్.ఆర్ కళ్యాణమండపం తో తన మార్క్ చూపించాడు. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఈమధ్యలో చేసిన సినిమాల్లో వినరో భాగ్యము విష్ణు కథ తప్ప మరో సినిమా ఆడలేదు. అయినా సరే మనోడు వెనక్కి తగ్గలేదు. తాజాగా సుజిత్, సందీప్ అనే దర్శక ద్వయం డైరెక్షన్లో క మూవీ తో గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఈ మూవీ టీజర్ , ట్రయిలర్ తోనే ఆకట్టుకోగా..సినిమా అంతకు మించి ఉండడం తో ప్రేక్షకులు బ్రహ్మ రథంపట్టారు. ఎవరు చూడు సినిమా సూపర్ గా ఉంది..ఖచ్చితంగా చూడాల్సిందే అని చెపుతుండడం తో యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కు పరుగులు పెట్టారు. దీంతో రెండు వారాలు తిరిగేలోపే రూ.50 కోట్ల క్లబ్ లో చేరింది. . ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం అధికారికంగా ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. కేవలం 15 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 50 కోట్లు వసూలు చెయ్యడంతో కిరణ్ అబ్బవరంతో పాటు, ఇటు చిత్రబృందం సైతం ఎంతో సంతోషంగా ఉన్నారు. వరుస ఫ్లాప్స్ తో ఉన్న కిరణ్ అబ్బవరం కి ‘క’ సినిమా భారీ విజయాన్ని ఇచ్చింది. అంతేకాకుండా తాజాగా విడుదలైన కంగువా, మట్కా వంటి పెద్ద సినిమాలకి కూడా ‘క’ చిత్రం మంచి పోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది.
Read Also : Viswak Sen : దేవర 50 డేస్.. థియేటర్ లో విశ్వక్ సేన్ సందడి..!