Site icon HashtagU Telugu

Kanguva: ఆ చెత్త సినిమాల కంటే నా భర్త సినిమాలు చాలా నయం.. సంచలన వాఖ్యలు చేసిన జ్యోతిక?

Kanguva

Kanguva

స్టార్ హీరో సూర్య గురించి మనందరికీ తెలిసిందే. సూర్య ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇక సూర్య చివరగా నటించిన చిత్రం కంగువ. సినిమా విడుదలకు ముందు ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా రికార్డులు తిరగరాస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచింది. ఇకపోతే హీరో సూర్య ఎన్నో డిఫరెంట్ మూవీ చేసిన విషయం తెలిసిందే.

అలాగే చాలా ప్రయోగాత్మక సినిమాలు కూడా చేశారు. అలా వచ్చిన వాటిలో కంగువ కూడా ఒకటి. దాదాపు 350 కోట్లకు పైగా ఖర్చుతో తెరకెక్కిన ఈ సినిమా 100 కోట్ల వసూళ్లను కూడా రాబట్టలేకపోయింది.ఈ సినిమా సౌండింగ్ విషయంలో చాలా విమర్శలు వచ్చాయి. సౌండ్ ఎక్కువగా ఉండటంతో సినిమా గందరగోళంగా ఉంది అని చాలా మంది విమర్శించారు. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన విషయం తెలిసిందే. ఇందులో దిశా పఠానీ, బాబీ డియోల్, కోవై సరళ, యోగి బాబు, రెడ్టిన్ కింగ్స్లీ, నటరాజన్ సుబ్రమణియన్, జగపతి బాబు, కెఎస్ రవికుమార్ లాంటి వారు కీలక పాత్రల్లో కనిపించారు.

యూవీ క్రియేషన్స్‌, స్టూడియో గ్రీన్‌ సంస్థలు సంయుక్తంగా భారీ వ్యయంతో కంగువ చిత్రాన్ని నిర్మించాయి. ఈ చిత్రాన్ని 10కి పైగా భాషల్లో 3డి టెక్నాలజీలో చిత్రీకరించారు. అయితే కంగువ సినిమాకు నెగిటివ్ రివ్యూలు రాయడం వల్లే ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గిందని నటి,సూర్య సతీమణి జ్యోతిక అన్నారు. తాజాగా సూర్య భార్య జ్యోతిక ఈ సినిమా గురించి స్పందించింది. ఈ మేరకు ఒక టాక్ షోలో భాగంగా ఆమె మాట్లాడుతూ.. సౌత్ నుంచి వచ్చిన ఎన్నో చెత్త సినిమాల కంటే కంగువ సినిమా బెటర్. ఎన్నో చెత్త సినిమాలు కమర్షియల్‌ గా విజయం సాధించిన సందర్భాలు ఉన్నాయి. అంతే కాదు ఆ చెత్త సినిమాలు మంచి వసూళ్లు కూడా రాబట్టాయి. అయితే నా భర్త నటించిన కంగువా చిత్రం వాటి కంటే నయం అని ఆమె అన్నారు. అయితే కంగువా సినిమా విషయంలో రివ్యూలు మాత్రం దారుణంగా రాశారు. ఏమాత్రం విచక్షణ లేకుండా రివ్యూలు రాశారని నాకు అనిపించింది అంటూ తన అభిప్రాయాన్ని తెలిపారు జ్యోతిక. ఇందుకు సంబంధించిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.