యావత్ సినీ అబిమానులు , సినీ ప్రముఖులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సూర్య (Surya) కంగువా (Kanguva ) మూవీ భారీ అంచనాల నడుమ పలు భాషల్లో నవంబర్ 14 న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో శివ (Siva) డైరెక్ట్ చేసిన ఈ మూవీ లో బాలీవుడ్ భామ దిశాపటానీ ఫీ మేల్ లీడ్ రోల్ పోషించగా..బాబీ డియోల్ విలన్‌గా నటించాడు. అయితే సినిమా అనుకున్న రీతిలో అలరించకపోవడం తో అభిమానులు బాగా డిస్పాయింట్ అయ్యారు.
సూర్య – శివ మూవీ అనగానే ఓ రేంజ్ లో ఉంటుందని , దేవి శ్రీ తోడవ్వడం తో థియేటర్స్ దద్దరిల్లిపోతాయని ఇలా ఎవరికీ వారే ఎన్నో అనుకున్నారు కానీ అవన్నీ కూడా తలకిందులయ్యాయి. స్లో నేరేషన్ , ఆకట్టుకోలేని మ్యూజిక్ , ఇలా అనేక కారణాలు సినిమాను యావరేజ్ గా చేసాయి. ఇప్పటికే సినిమా కలెక్షన్లు బాగా తగ్గాయి. అయితే ఈ సినిమా పై సూర్య భార్య , నటి జ్యోతిక (Jyothika) స్పందించింది. కంగువా సినిమా తొలి అరగంట బాగాలేదని తేల్చి చెప్పింది. ఆ అరగంటమినహాయిస్తే మిగతా సినిమా అద్భుతమని కొనియాడారు. సూర్య భార్యగా కాకుండా సినిమా లవర్ గా తానీ వ్యాఖ్యలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దేవి శ్రీ మ్యూజిక్ మాత్రం ఆకట్టుకోలేకపోయిందని పేర్కొంది. ఇక ఈ మూవీ కలెక్షన్స్ చూస్తే..
కంగువా ప్రీ రిలీజ్ బిజినెస్ 190 కోట్ల రూపాయల మేర జరగ్గా.. సూర్య మూవీకి రూ. 195 కోట్ల షేర్, 390 కోట్ల గ్రాస్‌ను బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా నిర్దేశించారు. భారీ అంచనాల నేపథ్యంలో ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 6000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. మూడు రోజుల వరకు కంగువా ప్రపంచవ్యాప్తంగా రూ.70 కోట్ల వరకు వసూళ్లు సాధించగా , బ్రేక్ ఈవెన్ టార్గెట్ దాదాపు రూ.130 కోట్ల వరకు ఉంది. అవి వస్తాయా అనేది సందేహమే అని చెపుతున్నారు. ఇప్పటీకే కలెక్షన్లు బాగా డ్రాప్ అవ్వడం..రేపటి నుండి మళ్లీ ఆఫీసులు , స్కూల్స్ ఇలా అంత బిజీ అవుతారు కాబట్టి సినిమా చూసే ఛాన్స్ లేదని అంటున్నారు.
Read Also : Navneet Rana : బీజేపీ నేత నవనీత్ రాణాపై కుర్చీలతో దాడి.. ఏమైందంటే..