Ashu Reddy Glamour Show : సోషల్ మీడియా ద్వారా ‘జూనియర్ సమంత’గా గుర్తింపు తెచ్చుకున్న అషు రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచింది. రాంగోపాల్ వర్మతో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూలతో పాపులారిటీ పెంచుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా చేసిన గ్లామరస్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ప్రకృతి నేపథ్యంతో స్టైలిష్‌గా కనిపించిన అషు రెడ్డి ఫోటోలపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తుండగా, కొంతమంది నెటిజన్లు విమర్శాత్మక కామెంట్లు చేస్తున్నారు.
Ashu Reddy Glamorous Photoshoot
సోషల్ మీడియా నుంచి వెండితెర వరకు తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది అషు రెడ్డి . సినీ బ్యాగ్రౌండ్ లేకపోయినా, టిక్‌టాక్ వీడియోల ద్వారా విపరీతమైన ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ చూడటానికి కాస్త సమంతలా ఉండటంతో ‘ జూనియర్ సమంత ’గా గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియా వేదికగా నిత్యం వైరల్ అవుతూ, యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ పాపులారిటీ ఆమెను బిగ్‌బాస్ తెలుగు హౌస్ వరకు తీసుకెళ్లింది. హౌస్‌లో ఎక్కువకాలం కొనసాగలేకపోయినా షో తర్వాత అషు రెడ్డి క్రేజ్ మాత్రం తగ్గలేదు.
Ashu Reddy Glamorous Photoshoot
బిగ్‌బాస్ అనంతరం అషు రెడ్డి యాంకర్‌గా, ఇంటర్వ్యూయర్‌గా మరింత యాక్టివ్ అయ్యారు. ముఖ్యంగా వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మతో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూలు ఆమెకు విపరీతమైన గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఈ ఇంటర్వ్యూలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ కావడంతో అషు రెడ్డి పేరు మరింతగా చర్చల్లో నిలిచింది. ఇలా యాంకర్‌గా, నటిగా బిజీగా ఉన్న అషు రెడ్డి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటారు. తరచూ తన ఫోటోషూట్స్, వీడియోలతో అభిమానులను అలరిస్తూ ఉంటారు. గ్లామర్ ఫోటో షూట్స్ చేయడంలో ఈమె ముందుంటారు. తన లుక్, స్టైల్‌తో యూత్‌ను ఆకట్టుకోవడమే కాకుండా, సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ట్రెండింగ్‌లో ఉండేలా ప్లాన్ చేస్తూ ఉంటారు. అషు రెడ్డి షేర్ చేసే ఫోటోలు, వీడియోలు నిమిషాల్లో వైరల్ కావడం ఆమె క్రేజ్‌కు నిదర్శనం.
Ashu Reddy Glamorous Photoshoot
తాజాగా అషు రెడ్డి చేసిన ఫోటోషూట్ మరోసారి సోషల్ మీడియాను హీటెక్కించింది. అందమైన ఈ ఫోటోషూట్‌లో ఆమె స్టైలిష్‌గా, గ్లామరస్‌గా కనిపించారు. ఈ ఫోటోలు షేర్ చేసిన కొద్దిసేపటికే సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. అభిమానులు పెద్ద ఎత్తున లైకులు, షేర్లతో స్పందించారు. ముఖ్యంగా ఆమె లుక్, కాన్ఫిడెన్స్‌పై చాలామంది ప్రశంసలు కురిపించారు. అయితే, ఈ ఫోటోషూట్‌కు నెగిటివ్ స్పందన కూడా వస్తోంది. కొంతమంది నెటిజన్లు “సూపర్”, “స్టన్నింగ్”, “హాట్ లుక్” అంటూ ప్రశంసలు కురిపిస్తుంటే, మరికొందరు విమర్శలు కూడా చేస్తున్నారు. ఆమె లుక్‌పై ట్రోలింగ్ చేస్తూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Ashu Reddy Glamorous Photoshoot
ఇటీవల సెలబ్రిటీల వస్త్రధారణపై జరిగిన చర్చల నేపథ్యంలో, అషు రెడ్డి ఫోటోలపై వచ్చిన కామెంట్లు మరింత చర్చకు దారితీశాయి. కొందరు నెటిజన్లు ‘నీకు మంగపతే కరెక్ట్’ అంటూ ఆమె డ్రెస్సింగ్‌పై విమర్శలు కురిపిస్తున్నారు. అయితే అషుకి ఇలాంటి ట్రోలింగ్ అలవాటే కాబట్టి ఈ విమర్శల్ని పట్టించుకుంటుందని అనుకోలేం. మొత్తానికి మహిళల వస్త్రధారణపై డిస్కషన్ జరుగుతున్న వేళ అషు రెడ్డి ఫోటో షూట్ నెట్టింట వైరల్‌గా మారింది.
