Site icon HashtagU Telugu

Junior NTR : జపాన్‌‌‌ నుంచి తిరిగొచ్చిన ఎన్టీఆర్.. అక్కడి భూకంపంపై ఏమన్నారంటే..

Junior Ntr

Junior Ntr

Junior NTR : జపాన్‌లో సంభవించిన భారీ భూకంపంపై  జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) స్పందించారు. భూకంపం బారిన పడిన ప్రజల గురించి ఆలోచిస్తుంటే గుండె తరుక్కుపోతోందని ఆయన చెప్పారు. వాళ్లంతా త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. జపాన్ ప్రజలూ ధైర్యంగా ఉండండి అని కోరారు. ‘‘న్యూ ఇయర్ వేడుకలను నేను ఈసారి జపాన్‌లోనే చేసుకున్నాను. గత వారమంతా అక్కడే ఉన్నాను’’ అని ఇటీవల జరిగిన తన జపాన్ టూర్ గురించి జూనియర్ ఎన్టీఆర్ గుర్తు చేసుకున్నారు. ‘‘జపాన్ నుంచి సోమవారం సాయంత్రం ఇంటికి వచ్చాను. అక్కడ సంభవించిన భూకంపం గురించి తెలిసి షాక్ అయ్యాను’’ అని పేర్కొంటూ ఆయన ట్వీట్ చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

సినిమా షూటింగ్స్ మధ్యలో కాస్త టైం తీసుకొని ఫ్యామిలీతో కలిసి జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల హాలిడే ట్రిప్ కోసం జపాన్‌కు వెళ్ళారు. జపాన్ నుంచి సోమవారం సాయంత్రం హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ఎన్టీఆర్ ఫ్యామిలీ హైదరాబాద్ ఎయిర్ పోర్టులో అడుగుపెట్టిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అబ్బాయిలు అభయ్ రామ్, భార్గవ్ రామ్, భార్య ప్రణతితో కలిసి ఎన్టీఆర్ జపాన్‌కు వెళ్ళారు. కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ సినిమాను జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్నారు. ఆ సినిమా వీడియో గ్లింప్స్‌ను ఈ నెల 8న విడుదల చేయనున్నారు. ఏప్రిల్ 5న ‘దేవర’ పార్ట్ 1 విడుదల కానుంది. ఆ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా చేస్తున్నారు.

Also Read: Impregnating Cheat : ప్రెగ్నెంట్ చేస్తే రూ.13 లక్షల ఆఫర్.. మాఫియా గుట్టురట్టు

ఇక జపాన్‌లో రిక్టర్‌ స్కేల్‌పై 7.4 తీవ్రతతో సోమవారం భూకంపం వచ్చింది.  సెంట్రల్ జపాన్‌లో దీని ప్రభావం ఎక్కువగా కనిపించింది.  పలు ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. ఆస్తి నష్టం, ప్రాణనష్టం కూడా జరిగిందని అంటున్నారు. అయితే ఆ వివరాలు ఇంకా తెలియరాలేదు.