Site icon HashtagU Telugu

Jr NTR : ఇదే నిజ‌మైతే జూ.ఎన్టీఆర్ అభిమానుల‌ను ఆప‌లేం..!

Aadi Rerelease

Aadi Rerelease

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో రీ-రిలీజ్‌ల ట్రెండ్ న‌డుస్తోంది. ఫ్యాన్స్ కూడా ఈ రీ-రిలీజ్‌ల మూవీల‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. హీరోల పుట్టిన‌రోజు సంద‌ర్భంగా లేదా సినిమా విడుద‌లై ద‌శాబ్ద కాలం అయితే ఆ మూవీని చిత్ర నిర్మాతలు రీ-రిలీజ్ చేస్తున్నారు. టాలీవుడ్‌లో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు పోకిరి సినిమాతో రీ-రిలీజ్‌ల హ‌వా మొద‌లైంది. ఆగ‌స్ట్ 9న మ‌హేష్ బాబు పుట్టిన‌రోజు సంద‌ర్భంగా పోకిరి సినిమా రీ-రిలీజ్ అయింది. ఆ త‌ర్వాత వెను వెంట‌నే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆయ‌న న‌టించిన‌ సినిమాలు తమ్ముడు, జ‌ల్సా సినిమాలు రీ-రిలీజ్ అయ్యాయి. తాజాగా బాల‌కృష్ణ న‌టించిన చెన్నకేశవరెడ్డి సినిమా కూడా రీ-రిలీజ్ అయ్యి టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి.

తాజ‌గా మ‌రో స్టార్ హీరో మూవీ రీ-రిలీజ్ మూవీలో జాబితాలో చేర‌నుంది. జూనియర్‌ ఎన్టీఆర్ న‌టించిన‌ బ్లాక్‌బస్టర్‌ చిత్రం ఆది మూవీ కూడా థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌టానికి సిద్ద‌మైంది. ఫ్యాక్షన్‌ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం రీ-రిలీజ్‌కు నవంబర్‌లో భారీ ఎత్తున సన్నాహాలు జరుగుతున్నట్లు ఫిల్మ్‌న‌గ‌ర్‌లో ఊహ‌గానాలు మొద‌ల‌య్యాయి.

సీనియ‌ర్ ఎన్టీఆర్ మ‌నవ‌డిగా, హ‌రికృష్ణ కొడుకుగా ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు జూనియ‌ర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ న‌టించిన ఆది సినిమా 22 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో నవంబర్ 3వ వారంలో సినిమాను మ‌రోసారి రీ-రిలీజ్ చేయ‌టానికి చిత్ర బృందం యోచిస్తోన్న‌ట్లు స‌మాచారం. అయితే ఆ మూవీకి నిర్మాతగా వ్య‌వ‌హ‌రించిన‌ బెల్లంకొండ సురేశ్‌ నవంబర్‌ 3వ వారంలో ఆది రీ-రిలీజ్ ఉంటుంద‌ని చెప్పినట్లు స‌మాచారం. ఈ విషయం తెలిసిన ఎన్టీఆర్ అభిమానులు, నందమూరి ఫ్యాన్స్ ఆనంద‌ప‌డుతున్నారు. మరి ఈ వార్తల్లో నిజం ఉందో లేదో తెలియాలంటే నవంబర్‌ వరకు వేచి చూడాల్సిందే. ఆది మూవీకి వి.వి. వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఎన్టీఆర్‌- కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో ఎన్టీఆర్ 30 మూవీ రాబోతున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ అక్టోబ‌ర్ చివ‌రి వారం నుంచి ప్రారంభం కానున్న‌ట్లు స‌మాచారం.