NTR-Allu Arjun: టాలీవుడ్‌లో ప్రస్తుత యంగ్ జనరేషన్‌లో స్టార్ హీరోలు అనగానే జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ గుర్తుకొస్తారు. తెలుగులో ఈ ఇద్దరి నటులకు ఉన్న క్రేజ్ అంతా, ఇంకా కాదు. ఇద్దరికి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. నటనపరంగా, డ్యాన్స్ పరంగా వీరిద్దరిని సమబుజ్జీలుగా చెబుతూ ఉంటారు. ఇద్దరిలో ఎవరు గ్రేట్ అంటే ఎవరూ చెప్పలేని పరిస్థితి. అయితే ఇటీవల అల్లు అర్జున్, ఎన్టీఆర్ స్టార్‌డమ్ పాన్ ఇండియా స్థాయికి చేరుకుంది. దీంతో బాలీవుడ్ డైరెక్టర్లు, నిర్మాతలు వీరితో సినిమాలు తీసేందుకు క్యూ కడుతున్నారు.
ప్రస్తుతం బాలీవుడ్‌లో ది ఇమ్మోర్టల్ అశ్వద్ధామ అనే సినిమా తెరకెక్కుతోంది. జాతీయ అవార్డు గ్రహీత ఉరి:ది సర్జికల్ స్ట్రైక్ ఫేం ఆదిత్య ధర్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. జియో స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. ముందుగా హీరో విక్కీ కౌశల్ తో ఈ సినిమాను తెరకెక్కించాలని నిర్మాతలు బావించారు. ఆ తర్వాత విక్కీ స్థానంలో రణ్‌వీర్‌సింగ్‌ను తీసుకోవాలని భావిస్తున్నారు. అయితే రణ్‌వీర్ సింగ్ ఈ సినిమాలో భాగం కాకపోవడంతో ఇప్పుడు దక్షిణాది హీరోలను పెట్టుకునే దిశగా నిర్మాతలు అడుగులు వేస్తున్నారు.
అల్లు అర్జున్, ఎన్టీఆర్ పేర్లును ఈ సినిమాకు ఫైనల్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. వీరిద్దరిలో ఒకరిని ఫైనల్ చేయాలని నిర్మాతలు చూస్తున్నారు. దీంతో వీరిద్దరిలో ఎవరికి అవకాశం దక్కుతుందనేది చర్చనీయాంశంగా మారింది. అయితే ఇద్దరు కలిసే నటించే అవకాశముందనే చర్చ మరోవైపు జరుగుతోంది. ఇందులో సమంత హీరోయిన్ గా నటించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పేరు ఇంకా ఖారారు కాలేదు. ఇక అల్లు అర్జున సుకుమార్ దర్శకత్వంలో పుష్ప పార్ట్ 2లో నటిస్తున్నాడు. ఇక కొరటాల శివ తర్వాత ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ సినిమా చేయనున్నాడు.
