NTR : ఎన్టీఆర్ స్టార్‌డమ్ వల్లే.. నందమూరి ఫ్యామిలీ ఆదరించిందా.. తారక్ ఏం చెప్పాడు..?

జూనియర్ ఎన్టీఆర్ స్టార్‌డమ్ వల్లే నందమూరి ఫ్యామిలీ ఆదరించిందా. ఈ ప్రశ్నకి ఎన్టీఆర్ ఏం చెప్పారు.

  • Written By:
  • Publish Date - April 20, 2024 / 08:29 PM IST

NTR : జూనియర్ ఎన్టీఆర్ హరికృష్ణ రెండో భార్యకి పుట్టిన సంతానం అన్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయాన్ని నందమూరి కుటుంబం మొదటిలో అంగీకరించలేదని, ఎన్టీఆర్ ని నందమూరి వారసుడిగా ఒప్పుకోలేదని ఓ టాక్ ఉండేది. సినిమాల్లో ఎన్టీఆర్ కి స్టార్‌డమ్ వచ్చిన తరువాతే.. నందమూరి కుటుంబం దగ్గరికి తీసుకుందని చాలామంది చెప్పుకొస్తుంటారు. మరి దీని గురించి ఎన్టీఆర్ ఏం చెప్పారు..?

ఈ విషయం గురించి ఎన్టీఆర్ ని ఓ ఇంటర్వ్యూలో ప్రశించారు. “జూనియర్ ఎన్టీఆర్ కి సినిమాల్లో స్టార్‌డమ్ రాకుంటే నందమూరి ఫ్యామిలీ మిమ్మల్ని దగ్గర చేసుకునేదా..?” అంటూ ప్రశ్న వేశారు.

ఇక దీనికి ఎన్టీఆర్ బదులిస్తూ.. “నేను సినిమాల్లోకి రాలేదు అనుకోండి. ఎక్కడో బిజినెస్ చేసుకుంటున్నాను. అందులో బాగా సక్సెస్ అయ్యాను. అప్పుడు కూడా పలకరించేవాళ్ళు. అలా కాకుండా అసలు నేను ఏ రంగంలో సక్సెస్ అవ్వలేదు అనుకోండి. ఎప్పటికో అప్పుడు నన్ను కచ్చితంగా దగ్గర తీసుకునేవారు. తాతగారు (సీనియర్ ఎన్టీఆర్) నన్ను కేవలం పలకరించడానికి 11 ఏళ్ళు పట్టింది.

అలాగే మా బాబాయి, పిన్ని, అత్తలకు కూడా టైం పట్టేదేమో. తాతగారికి 11 ఏళ్ళు పట్టింది, వీళ్ళకి 26 ఏళ్ళు పట్టేదేమో. కానీ ఎప్పటికైనా కలిసేవాళ్ళం లేక కలవకపోయుండచ్చేమో. అయితే మన ప్రతి విషయానికి నెగటివ్ గా కాకుండా పాజిటివ్ గా తీసుకుంటే మనకి ఎలాంటి బాధ అనిపించదు. ఎవరి మీద కోపం అనిపించదు. నాకు మా బాబాయిల పై ఎవరు పైన కోపం లేదు. వాళ్ళకి నా మీద కోపం లేదు. ఇక్కడ ఎవరిది తప్పు కాదు. మన రాత అలా ఉంది అంతే. అది ఎలా రాసి ఉంటే అలాగే జరుగుతుంది” అంటూ చెప్పుకొచ్చారు.