Site icon HashtagU Telugu

Singer Jubin Nautiyal injured: ప్రముఖ సింగర్ కు ప్రమాదం

Jpg (2)

Jpg (2)

ప్రముఖ భారతీయ గాయకుడు జుబిన్ నౌటియాల్ గురువారం ఉదయం ప్రమాదానికి గురయ్యారు. ముంబైలోని ఓ ఆసుపత్రిలో చేరాడు. భవనం మెట్లపై నుంచి కిందపడటంతో గాయకుడికి తీవ్ర గాయాలయ్యాయి. జుబిన్ ఎన్నో సూపర్‌హిట్‌లకు గాత్రాన్ని అందించారు. ఈ వార్త వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. భవనం మెట్ల పై నుంచి పడిపోవడంతో అతని మోచేయి, పక్కటెముకలు, తలకు గాయాలయ్యాయి. అతని కుడి చేతికి సర్జరీ జరగనున్నట్లు మీడియా వర్గాలు చెబుతున్నాయి. తన కుడి చేయిని ఉపయోగించవద్దని అతడికి డాక్టర్లు సలహా ఇచ్చినట్లు సమాచారం.

జుబిన్ నౌటియాల్ కొత్త పాట ‘తు సామ్నే ఆయే’ ఇటీవల విడుదలైంది. అతను యోహానితో పాట పాడాడు. గురువారం పాట లాంచ్‌లో నౌతియాల్, యోహాని కలిసి కనిపించారు. దీని తర్వాత అతను గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో జుబిన్ కుడి చేతికి చాలా గాయాలయ్యాయి. అతని హెల్త్ అప్‌డేట్ తెలుసుకోవాలని అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. సింగర్ జుబిన్ అభిమానుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. ‘రాతన్ లంబియాన్’ లూట్ గయే, హమన్వా మేరే, తుజే కిత్నే చాహ్నే లగే హమ్ వంటి అంతర్జాతీయ హిట్‌లతో ప్రజలు కూడా అతనిని వీడియోలలో చూడటానికి ఇష్టపడతారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.

 

Exit mobile version