Jr NTR’s Simhadri: రిరిలీజ్ లోనూ ‘సింహాద్రి’ రికార్డులు.. యంగ్ టైగర్ ఫ్యాన్స్ కు పూనకాలే!

ఎన్టీఆర్ పుట్టినరోజు సింహాద్రి మూవీ విడుదల కాబోతోంది. ఎప్పుడో ఇరవై ఏళ్ళ కిందట వచ్చిన సినిమాకు వెయ్యి షోలతో రన్ కానుంది.

  • Written By:
  • Updated On - May 19, 2023 / 02:54 PM IST

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) కు సరైన కథ పడాలేకానీ.. ఏ సినిమా అయినా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేగాల్సిందే. కలెక్షన్ల పంట పండాల్సిందే. తన నటనతో సినిమాను నెక్ట్స్ లెవల్ కు తీసుకువెళ్లగలడు జూనియర్ ఎన్టీఆర్. అందుకే జూనియర్ సినిమా రిలీజ్ అవుతుందంటే అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటారు. ఇటీవల ఆర్ఆర్ఆర్ లో కొమురం భీమ్ పాత్రలో అదరగొట్టిన ఎన్టీఆర్ ఓ వింటేజ్ మూవీతో మళ్లీ వస్తున్నాడు.

టాలీవుడ్ (Tollywood) లో రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీంతో స్టార్స్ బర్త్ డే కు అలనాటి వింటేజ్ సినిమాలు ప్రేక్షకుల ముందుకొస్తూ ఎంటర్ టైన్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ పుట్టినరోజు సింహాద్రి మూవీ విడుదల కాబోతోంది. ఎప్పుడో ఇరవై ఏళ్ళ కిందట వచ్చిన సినిమాకు వెయ్యి షోలతో రీ రిలీజ్ ప్రపంచంలో ఎక్కడా ఉండదని ఎన్టీఆర్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ లోనూ సింహాద్రిని గ్రాండ్ గా ప్లాన్ చేశారు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో 2003లో వచ్చిన ఈ ఇండస్ట్రీ హిట్ ని అప్పట్లో థియేటర్ అనుభూతి చెందని ఫ్యాన్స్ అందరూ మే 20 కోసం ఎదురు చూస్తున్నారు.

దానికి తగ్గట్టే అడ్వాన్స్ బుకింగ్స్ మంచి స్వింగ్ లో ఉన్నాయి. ప్రధాన కేంద్రాల్లో ఉదయం షోలు దాదాపుగా ఫుల్ అయ్యాయి. పోకిరి, జల్సా, ఖుషి రేంజ్ లో సింహాద్రి (Simhadri) రికార్డులు సృష్టించడం ఖాయమని యంగ్ టైగర్ ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. ఇంతకు ముందు రీ రిలీజ్ అయిన బాద్షా, ఆంధ్రావాలాలు ఆశించిన స్థాయి స్పందన దక్కించుకోలేదు. కేవలం ట్రెండ్ ని క్యాష్ చేసుకునే ఉద్దేశంతో యావరేజ్ ఫ్లాపులని వదిలారని ఇప్పుడు అసలైన సినిమా రాబోతుందని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Tollywood Politics: చిరు, మోహన్ బాబులకు షాక్.. ఎన్టీఆర్ వేడుకలకు నో ఇన్విటేషన్?