Jr NTR’s farmhouse: జూనియర్ ఎన్టీఆర్ ఫామ్ హౌజ్ ను చూశారా!

సౌత్ స్టార్ హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. రెండు దశాబ్దాలకు పైగా సినీ ప్రేక్షకులను అలరిస్తున్నారు.

Published By: HashtagU Telugu Desk
Jr Ntr

Jr Ntr

సౌత్ స్టార్ హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. రెండు దశాబ్దాలకు పైగా సినీ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రతి సినిమాలో తన బెస్ట్‌ని అందించాలనే అంకితభావమే ఎన్టీఆర్ కు ‘యంగ్ టైగర్ ఆఫ్ టాలీవుడ్’ అనే బిరుదును ఇచ్చింది. తారక్ 2021లో హైదరాబాద్ జిల్లా శంకర్‌పల్లి మండల పరిధిలోని గోపాలపురం గ్రామంలో ఆరున్నర ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశాడు.

కొన్ని అందమైన తోటలతో కళకళలాడే ఆ ఫామ్ కు ‘బృందావనం’ అని పేరు పెట్టాడు. తారక్ తన భార్య లక్ష్మి ప్రణతికి బర్త్‌డే గిఫ్ట్‌గా ఫామ్‌హౌస్‌ను బహుమతిగా ఇచ్చాడని వార్తలు వచ్చాయి. ఫామ్ హౌజ్ ను డెవలప్ మెంట్ చేయడం కోసం 9 కోట్లకుపైగా ఖర్చు చేశాడట. త్వరలో చాలా గ్రాండ్‌గా ప్రారంభోత్సవం చేయనున్నట్టు సమాచారం. ఫామ్‌హౌస్‌తో పాటు, జూనియర్ ఎన్టీఆర్ కు హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌లో విలాసవంతమైన బంగ్లాను కూడా ఉంది. Housing.com ప్రకారం ఎన్టీఆర్ బంగ్లా విలువ రూ. 25 కోట్లు ఉండొచ్చని అంచనా.

 

  Last Updated: 19 Jul 2022, 05:05 PM IST