NTR Energetic: ఎన్టీఆర్ ఎనర్జీని ఎవరూ మ్యాచ్ చేయలేరు!

ఎన్టీఆర్ లో ఫుల్ ఎనర్జీ ఉంటుంది. ఆయన ఏ స్టేజీ మీద కనిపించినా ఎనర్జిటిక్ గా కనిపిస్తారు.

Published By: HashtagU Telugu Desk
Ntr

Ntr

ఎన్టీఆర్ లో ఫుల్ ఎనర్జీ ఉంటుంది. ఆయన ఏ స్టేజీ మీద కనిపించినా ఎనర్జిటిక్ గా కనిపిస్తారు. టాలీవుడ్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా జూనియర్ కు మంచి క్రేజ్ ఉంది. RRR ప్రపంచవ్యాప్తంగా విజయం సాధించిన తర్వాత థియేటర్స్ లో నే కాకుండా, డిజిటల్‌గా కూడా కల్ట్ ఫాలోయింగ్‌ ఉన్న నటుడు ఎన్టీఆర్. అభిమానులే కాదు పలువురు సెలబ్రిటీలు, సహ నటులు కూడా ఎన్టీఆర్ ను ఎంతగానో అభిమానిస్తున్నారు. ఇటీవల శాకిని, డాకిని మూవీ ప్రమోషన్స్‌లో నివేదా థామస్, రెజీనా కసాండ్రా తారక్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.

ఎన్టీఆర్ సహ నటులతో ఈజీగా కలిసిపోతారు. అరుదైన నటుల్లో ఎన్టీఆర్ ఒకరు అని నివేదా చెప్పగా, ఎన్టీఆర్‌, కమల్‌హాసన్‌ చాలా విషయాల్లో పోలికలు ఉంటాయని  రెజీనా చెబుతోంది. “తారక్‌లో చాలా ఎనర్జీ ఉంది, అతను ఎప్పుడూ అలసిపోడు. ప్రతి నిమిషంగా ఉల్లాసంగా, ఉత్సహంగా ఉంటాడు. తారక్ కూడా కమల్ హాసన్ లాగా ఫన్నీగా ఉంటాడు. కానీ కమల్ సర్ హాస్యం చాలా భిన్నంగా ఉంటుంది. ఎన్టీఆర్ తో సమయం గడిపినప్పుడు మాత్రమే ఆ విషయం అర్థం అవుతుంది” అని స్టేట్ మెంట్ ఇచ్చారు రెజీనా, నివేదా.

  Last Updated: 08 Sep 2022, 02:53 PM IST