Site icon HashtagU Telugu

Jr NTR wife: దేవకన్యలా మెరిసిపోతున్న ఎన్టీఆర్ భార్య.. ఫొటోలు వైరల్

Laxmi

Laxmi

యంగ్ టైగర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి ట్రెడిషనల్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె మీడియాకు దూరంగా ఉన్నప్పటికీ, ఆమెకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎన్టీఆర్ భార్యగా ప్రణతి అంటే నందమూరి అభిమానులు ఎప్పటినుండో అభిమానం ఉంది. కాగా తారక్ పలు సందర్భాల్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ తన భార్యపై తనకున్న ప్రేమను చాటుకున్నాడు. ఓ పెళ్లిలో ప్రణతి ట్రెడిషనల్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ ఫోటోలను జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తమ అభిమానుల పేజీలో షేర్ చేస్తున్నారు. ప్రణతి సిల్క్ చీరలో వజ్రాభరణాలతో చాలా అందంగా ఉంది. ఆమె సంప్రదాయ రుపానికి నందమూరి అభిమానులు ఫిదా అవుతున్నారు. దీంతో ప్రణతి ఫోటోలు ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్నాయి. సంప్రదాయ దుస్తుల్లో అందంగా కనిపిస్తున్న ప్రణతి లేటెస్ట్ ఫోటోలపై మీరు కూడా ఓ లుక్కేయండి.