Site icon HashtagU Telugu

Jr NTR : ముంబైలో ఎన్టీఆర్.. బాలీవుడ్ నుంచి మొదలుపెట్టిన ‘దేవర’ ప్రమోషన్స్..

Jr NTR went To Mumbai for Devara Trailer Launch Event

Devara

Jr NTR : ఎన్టీఆర్ ‘దేవర'(Devara) సినిమా కోసం ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులు అంతా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 27న దేవర సినిమా రాబోతుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్, సాంగ్స్ తో దేవర సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా ట్రైలర్ ని సెప్టెంబర్ 10న రిలీజ్ చేస్తామని ప్రకటించారు మూవీ యూనిట్. దీంతో ఫ్యాన్స్ ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్నారు.

అయితే ఇప్పటివరకు దేవర సినిమాకు ఒక్క ప్రమోషనల్ ఈవెంట్ కూడా చేయలేదు. ట్రైలర్ లాంచ్ తోనే మొదలుపెట్టనున్నారు. కానీ దేవర ప్రమోషన్స్ బాలీవుడ్(Bollywood) నుంచి మొదలుపెట్టనున్నారు. RRR తో ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ డమ్ తెచ్చుకోవడంతో దేవర సినిమాని పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేస్తున్నారు. సినిమాలో జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్ కావడంతో బాలీవుడ్ లో దేవర సినిమాతో పాగా వేసి భారీ హిట్ కొట్టాలని చూస్తున్నాడు ఎన్టీఆర్.

అందుకే దేవర ట్రైలర్ రిలీజ్ కి రెండు రోజులు ముందే ఎన్టీఆర్ ముంబై వెళ్ళాడు. నేడు మధ్యాహ్నం ఎన్టీఆర్ ముంబైలో దిగాడు. దేవర ట్రైలర్ లాంచ్ అక్కడ ముంబైలో భారీగా చేయబోతున్నారట. ఎన్టీఆర్ ముంబై ఎయిర్ పోర్ట్ లో దిగిన విజువల్స్, అక్కడి మీడియాకు ఫోటోలు ఇచ్చిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇవి చూసి అప్పుడే ఎన్టీఆర్ కి బాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ వచ్చింది. ఇక దేవర రిలీజయితే బాలీవుడ్ లో ఎన్టీఆర్ కి ఏ రేంజ్ రెస్పాన్స్ వస్తుందో చూడాలి అని అనుకుంటున్నారు ఫ్యాన్స్. ముంబైలో ఎన్టీఆర్ విజువల్స్ చూసి ఫ్యాన్స్ వాటిని వైరల్ చేస్తున్నారు.

 

Also Read : Mokshagnya : ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు.. అప్పుడే కటౌట్లు, బ్యానర్లు, పాలాభిషేకాలు.. మోక్షజ్ఞ హవా..