ఇటీవల కాలంలో చాలా మంది హీరోలు నిర్మాతలు(Producers)గా మారుతున్నారు. ఇప్పటికే రామ్ చరణ్(Ram Charan), మహేష్ బాబు(Mahesh Babu), రానా, నితిన్, నాగార్జున, కళ్యాణ్ రామ్, రవితేజ(Raviteja).. ఇలా పలువురు హీరోలు నిర్మాతలుగా సినిమాలు తెరకెక్కిస్తున్నారు. మరికొంతమంది యువ హీరోలు కూడా నిర్మాతలుగా మారి సినిమాలు తీస్తున్నారు. కొత్త వాళ్లకు ఛాన్సులు ఇవ్వాలని, మరిన్ని కొత్త సినిమాలను అందించాలనే హీరోలంతా నిర్మాతలుగా మారుతున్నారు.
తాజాగా ఈ లిస్ట్ లో ఎన్టీఆర్(NTR) కూడా చేరబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా ఫుల్ బిజీగానే ఉన్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్. దాని తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా, ఆ తర్వాత బాలీవుడ్ లో వార్ 2 సినిమా చేయబోతున్నాడు. అయితే టాలీవుడ్ లో తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ నిర్మాతగా మారనున్నట్టు తెలుస్తుంది.
ఇప్పటికే అన్నయ్య కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పేరుతో సినిమాలు తీస్తున్నాడు. ఎన్టీఆర్ ఓ కొత్త నిర్మాణ సంస్థని ఏర్పాటు చేసి తన అన్నయ్య కళ్యాణ్ రామ్ తో కలిసి సినిమాలు నిర్మించబోతున్నట్టు సమాచారం. ఈ బ్యానర్ లో మొదటి సినిమా హీరో నానితో తెరకెక్కిస్తారని కూడా టాక్ వినిపిస్తుంది. అయితే దీనిపై అధికారిక సమాచారం లేదు. మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.
Also Read : Venkatesh : నిజమైన రాబందులను వెంకటేష్ మెడపై పెట్టి పొడిచేలా చేశారు.. ఏ సినిమాలో తెలుసా?