NTR : ఎన్టీఆర్ మీ ఇంటికి వస్తే.. ఇలా వంట చేసి భోజనం పెట్టండి..

గతంలో కీరవాణితో పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ తన ఫేవరెట్ ఫుడ్ రెసిపీని తెలియజేసారు.

  • Written By:
  • Publish Date - March 25, 2024 / 02:38 PM IST

టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) భోజన ప్రియుడు అని అందరికి తెలిసిందే. ఈ విషయాన్ని తానే స్వయంగా ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. అయితే ఎన్టీఆర్ కేవలం భోజన ప్రియుడు మాత్రమే కాదు, మంచి చెఫ్ కూడా. నాన్ వెజ్ వంటలు చేయడంలో ఎన్టీఆర్ దిట్ట. తెలుగు బిగ్‌బాస్ షోకి హోస్టుగా చేస్తున్న సమయంలో.. ఇంటిలోని హౌస్ మెంబెర్స్ అందరికి తన చేతులతో తానే స్వయంగా వంట చేసి పెట్టారు. ఇక ఆ ఫుడ్ ని బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ లొట్టలు వేసుకుంటూ తినేశారు.

ఆ సమయంలోనే ఎన్టీఆర్ వంట ప్రతిభని కూడా తెలుగు ఆడియన్స్ చూసారు. మరి అలాంటి ఎన్టీఆర్.. మీ ఇంటికి అతిథిగా వస్తే ఎలాంటి వంటతో ఆకట్టుకోవాలి. ఎన్టీఆర్ లాంటి చెఫ్ ని మెప్పించాలంటే.. ఏ విధంగా మీరు వంట ప్రిపేర్ చేసుకోవాలి..? ఈ ప్రశ్నకు కూడా ఎన్టీఆరే బదులిచ్చారు. ఎన్టీఆర్ కి నాటుకోడి గ్రిల్ చికెన్(Natu Kodi Grill Chicken) అంటే చాలా ఇష్టం అంట. ఆ ఫేవరెట్ ఫుడ్ ని ఎలా ప్రిపేర్ చేయాలి అనేది కూడా ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

గతంలో కీరవాణితో పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ తన ఫేవరెట్ ఫుడ్ రెసిపీని తెలియజేసారు. నాటుకోడిని బాగా కాల్చిన తరువాత.. అల్లం వెల్లులి పేస్ట్, పెరుగు, కారం, మసాలా మిశ్రమాన్ని ఆ కాల్చిన కోడి మొత్తనికి పట్టించి కాసేపు పక్కన పెట్టాలి. ఈ గ్యాప్ లో కాల్చిన కోడి పార్ట్స్ ని కైమాగా కొట్టేసి.. దానిని కైమా కర్రీ చేయాలి. ఇక ఆ కైమా కర్రీని.. పక్కన పెట్టిన కాల్చిన కోడి పొట్టలో పెట్టాలి. అనంతరం ఆ కోడిని గ్రిల్ కి తగిలించి.. మంటల పై కాల్చి ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా చికెన్ ని ప్రిపేర్ చేసుకోవాలంట.

ఇక ఈ చికెన్‌ని.. పెద్ద పెద్ద రోటీలు కాల్చుకొని, ఆ రోటీలను ఆ చికెన్ తో తినడం అంటే తనకి చాలా ఇష్టమని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. ఎవరైనా అభిమాని తనకి ట్రీట్ ఇవ్వాలంటే.. ఇలా ఫుడ్ ప్రిపేర్ చేయాలని ఎన్టీఆర్ తెలియజేసారు.

 

Also Read : Chiranjeevi : ఇండియాలో ఆ రికార్డు సాధించిన ఏకైక హీరో చిరంజీవి..