Site icon HashtagU Telugu

Jr NTR : రెండేళ్ల తర్వాత ఎన్టీఆర్ తనయుల ఫోటోలు బయటకి.. అప్పుడే ఇంత పెద్దోళ్ళు అయిపోయారా?

Jr NTR shares Family Photo with his Two Sons Photo Goes Viral

Jr NTR shares Family Photo with his Two Sons Photo Goes Viral

జూనియర్ ఎన్టీఆర్ RRR సినిమాతో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు. వచ్చే సంవత్సరం దేవర(Devara) సినిమాతో రాబోతున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు. ఇక గతంలో ఎన్టీఆర్ ఫ్యామిలీ విషయాలు ఎక్కువ షేర్ చేయకపోయినా ఇటీవల మాత్రం అప్పుడప్పుడు తన ఫ్యామిలీ ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకుంటున్నాడు.

తాజాగా దీపావళి సందర్భంగా తన ఫ్యామిలీతో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేశాడు ఎన్టీఆర్(Jr NTR ). ఈ ఫొటోలో ఎన్టీఆర్ తో పాటు భార్య ప్రణతి, ఇద్దరు కొడుకులు అభయ్ రామ్(Abhay Ram), భార్గవ్ రామ్(Bhargav Ram) లు ఉన్నారు. దీంతో ఈ ఫోటో వైరల్ గా మారింది. ఆల్మోస్ట్ రెండేళ్ల తర్వాత తన పిల్లల ఫోటోలు షేర్ చేశాడు ఎన్టీఆర్. పెద్ద కొడుకు అభయ్ రామ్ అయితే చాలా పెద్దోడు అయిపోయాడు. ఫొటోలో కళ్ళజోడు పెట్టుకొని అమ్మ పక్కన నించున్నాడు. ఇక చిన్నోడు నాన్న పక్కన ఉన్నాడు.

ఇద్దరు పిల్లలు చాలా రోజుల తర్వాత కనపడటంతో అభిమానులు సంతోషిస్తున్నారు. ఎన్టీఆర్ కొడుకులు అప్పుడే పెద్దోళ్ళు అయిపోతున్నారుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఫ్యామిలీ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read : Chandra Mohan: చంద్ర మోహన్ స్వయంగా ఎంపిక చేసిన టాప్ 30 సాంగ్స్ ఇవే