NTR Wife : భార్య పుట్టినరోజు.. జపాన్ లో సెలబ్రేషన్స్.. అమ్మలూ అంటూ క్యూట్ ఫోటోలు షేర్ చేసిన ఎన్టీఆర్..

నేడు ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి పుట్టిన రోజు.

Published By: HashtagU Telugu Desk
Jr NTR Shares Cute Photos with his Wife Pranathi and says Birthday Wishes

Ntr Jr

NTR Wife : జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం జపాన్ లో ఉన్న సంగతి తెలిసిందే. దేవర సినిమా జపాన్ లో మార్చ్ 28న రిలీజ్ కాబోతుంది. దీంతో ఎన్టీఆర్ జపాన్ లో ప్రమోషన్స్ భారీగా చేస్తున్నాడు. అక్కడ ఇంటర్వ్యూలు ఇస్తూ, అక్కడి ఫ్యాన్స్ తో సెలబ్రేషన్స్ చేసుకుంటూ హడావిడి చేస్తున్నాడు. ఇక్కడి కంటే ఎక్కువగా జపాన్ లో దేవర ప్రమోషన్స్ చేస్తున్నాడు.

నేడు ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి పుట్టిన రోజు. జపాన్ కి ఎన్టీఆర్ భార్యతో కలిసి వెళ్ళాడు. దీంతో తన భార్య పుట్టిన రోజు వేడుకలను జపాన్ లో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసినట్టు తెలుస్తుంది. జపాన్ లో తన భార్య ప్రణతితో దిగిన క్యూట్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసి.. అమ్మలూ హ్యాపీ బర్త్ డే అంటూ రాసుకొచ్చాడు.

దీంతో ఎన్టీఆర్ షేర్ చేసిన క్యూట్ ఫోటోలు వైరల్ గా మారాయి. ఎన్టీఆర్ ఫ్యాన్స్, నెటిజన్లు ప్రణతికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ కామెంట్స్ చేస్తున్నారు.

 

Also Read : Sonali Sood : సోనూ సూద్ భార్య, మరదలికి తీవ్ర గాయాలు.. ఏమైందంటే..

  Last Updated: 26 Mar 2025, 09:48 AM IST