Site icon HashtagU Telugu

Devara : ‘దేవర’ ఫస్ట్ సాంగ్ ప్రోమో రిలీజ్.. ఆల్ హెయిల్ టైగర్..

Jr Ntr Released Devara First Single Fear Song Glimpse

Jr Ntr Released Devara First Single Fear Song Glimpse

Devara : ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ చేస్తున్న ప్రాజెక్ట్ ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని కళ్యాణ్ రామ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా రాబోతున్న ఈ చిత్రం మొదటి భాగం అక్టోబర్ రిలీజ్ అయ్యేందుకు డేట్ ని ఫిక్స్ చేసుకుంది. ఇది ఇలా ఉంటే, ఈ నెల 20న ఎన్టీఆర్ బర్త్ డే ఉండడంతో.. ఆ రోజు మూవీ నుంచి మొదటి సాంగ్ ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ డేట్ ఫిక్స్ చేసారు.

ఇక ఆ సాంగ్ కంటే ముందే.. నేడు ఒక చిన్న గ్లింప్స్ ని రిలీజ్ చేసారు. ఎన్టీఆర్ తన సోషల్ మీడియా ద్వారా ‘ఫియర్ సాంగ్’ గ్లింప్స్ ని రిలీజ్ చేసారు. ఆ గ్లింప్స్ లో ఎన్టీఆర్ విజువల్స్ తో పాటు అనిరుద్ విజువల్స్ ని కూడా చూపించారు. ఆల్ హెయిల్ టైగర్ అనే హుక్ పదాన్ని మాత్రమే ఆ గ్లింప్స్ లో వినిపించారు. కాగా ఈ పాటతో అనిరుద్ గతంలో ఇచ్చిన రజినీకాంత్ ‘హుకుం’ సాంగ్ ని మర్చిపోతారంటూ పలువురు సెలబ్రిటీస్ సైతం కామెంట్స్ చేయడంతో.. ఈ ఫియర్ సాంగ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మరి ఆ అంచనాలను అనిరుద్ అందుకుంటారా లేదా చూడాలి. కాగా బర్త్ డే రోజు రిలీజ్ చేసే లిరికల్ వీడియోని రెండు వెర్షన్స్ తో కట్ చేయిస్తున్నారట. రెండిటిలో ఏది బాగుంటే.. దానిని ఆడియన్స్ ముందుకు తీసుకు రానున్నారట. ఇక ఈ లిరికల్ వీడియోలో ఎన్టీఆర్ ప్రెజెన్స్ కంటే ఎక్కువ అనిరుద్ విజువల్సే కనిపించనున్నాయట.