Site icon HashtagU Telugu

Jr NTR : దేవర విలన్ పై కత్తితో దాడి.. స్పందించిన ఎన్టీఆర్..

Jr Ntr Reacts about attack on Saif Ali khan

Jr Ntr

Jr NTR : బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్‌( Saif Ali Khan)పై ఇవాళ ఉదయం దాడి జరిగింది. ముంబై బాంద్రాలోని తన నివాసంలో నేడు తెల్లవారుజామున ఓ వ్యక్తి దొంగతనానికి రాగా అతన్ని పట్టుకుందామని సైఫ్ ప్రయత్నించేలోపు అతను కత్తితో దాడి చేసి పారిపోయాడు. ఈ దాడిలో సైఫ్ కు భారీగానే కత్తి పోట్లు పడ్డాయని సమాచారం. ప్రస్తుతం సైఫ్ ముంబైలోని లీలావతి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. అతని కుటుంబ సభ్యులంతా హాస్పిటల్ లోనే ఉన్నారు.

ఇప్పటికే సైఫ్ అలీఖాన్ పై జరిగిన దాడికి పలువురు బాలీవుడ్ నటీనటులు స్పందిస్తూ అతను క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నారు. అయితే సైఫ్ అలీఖాన్ ఎన్టీఆర్ దేవర సినిమాలో విలన్ గా చేసిన సంగతి తెలిసిందే. దీంతో సైఫ్ అలీఖాన్ పై జరిగిన దాడి పై జూనియర్ ఎన్టీఆర్ తన సోషల్ మీడియా వేదికగా స్పందించాడు.

తన ట్విట్టర్ లో ఎన్టీఆర్.. సైఫ్‌పై జరిగిన దాడి గురించి విని షాక్‌కు గురయ్యాను. ఆయన త్వరగా కోలుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను అంటూ పోస్ట్ చేసాడు. పలువురు ఫ్యాన్స్, నెటిజన్లు, సెలబ్రిటీలు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుతూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఎన్టీఆర్ దేవర డివైడ్ టాక్ వచ్చినా 500 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. దేవర సినిమాకు సీక్వెల్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సీక్వెల్ లో కూడా సైఫ్ అలీఖాన్ నటించనున్నారు.

 

Also Read : Saif Ali Khan : సైఫ్ అలీఖాన్ పై దాడి