NTR : ఫ్యామిలీతో కలిసి థాయిలాండ్‌కి ఎన్టీఆర్.. వెకేషన్‌కి కాదు.. మరేంటి..?

ఫ్యామిలీతో కలిసి థాయిలాండ్‌కి బయలుదేరిన ఎన్టీఆర్. అయితే ఇది వెకేషన్‌కి కాదు.. మరేంటి..?

  • Written By:
  • Publish Date - June 17, 2024 / 12:22 PM IST

NTR : మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర, వార్ 2 సినిమాలు చేస్తున్నారు. ఒక మూవీ తరువాత మరో మూవీ షూటింగ్ లో పాల్గొంటూ షెడ్యూల్స్ ని పూర్తి చేస్తూ వస్తున్నారు. ఇటీవలే గోవాలో దేవర సాంగ్ షూటింగ్ ని జరుపుకున్న ఎన్టీఆర్.. ఇప్పుడు థాయిలాండ్ బయలుదేశారు. ఎన్టీఆర్ తో పాటు ఆయన కుటుంబసభ్యులు భార్య లక్ష్మి ప్రణతి, కొడుకులు అభయ్ అండ్ భార్గవ్ కూడా థాయిలాండ్ పయనమయ్యారు.

నేడు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఈ నందమూరి కుటుంబం థాయిలాండ్ బయలుదేరారు. అయితే ఇది ఫ్యామిలీ వెకేషన్ అనుకుంటారేమో, అసలు కాదు. ఈ ప్రయాణం కూడా షూటింగ్ లో భాగమే. దేవర సాంగ్ షూట్ ని థాయిలాండ్ లో చేయనున్నారట. ఈక్రమంలోనే ఎన్టీఆర్ థాయిలాండ్ బయలుదేరారు. సినిమా షూటింగ్ తో పాటు ఫ్యామిలీతో కూడా ఎంజాయ్ చేసేందుకు ఎన్టీఆర్ ప్లాన్ చేసి.. వారిని థాయిలాండ్ తీసుకు వెళ్తున్నారు.

కాగా దేవర మూవీని ప్రీపోన్ చేస్తూ.. అక్టోబర్ నుంచి సెప్టెంబర్ కి తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 27న ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందుతుంది. ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా కావడం, మూవీని కూడా కొరటాల శివ భారీ స్థాయిలో తెరకెక్కిస్తుండడంతో.. ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం.. బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ ని అందుకుంటుందో చూడాలి.