Kalki 2898 AD: ప్రభాస్ ఫాంటసీ చిత్రంలో ఎన్టీఆర్, నాని

ప్రభాస్ నటిస్తోన్న కల్కి 2898 ఏడీ మూవీలో జూనియర్ ఎన్టీఆర్, నేచురల్ స్టార్ నాని నటిస్తున్నారనే వార్త తెగ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాపై ఇప్పుడు భారీ అంచనాలు ఉన్నాయి.

Kalki 2898 AD: రాజమౌళి చెక్కిన బాహుబలి చిత్రాలతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు హీరో ప్రభాస్. ఆ సినిమాల తర్వాత వరుసపెట్టి పాన్ ఇండియా చిత్రాలకు సైన్ చేస్తున్నాడు.అయితే బాహుబలి తర్వాత ఆ స్థాయి హిట్ పడలేదు మన డార్లింగ్ కి. అయితే తాజాగా సలార్ చిత్రంతో మంచి హిట్ కొట్టాడు. ఈ చిత్రం తర్వాత ప్రభాస్ నుంచి మరో ఫాంటసీ మూవీ రాబోతుంది. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ భారీ చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ చిత్రానికి కల్కి 2898 ఏడీ టైటిల్ ఖరారు చేశారు.

ప్రభాస్ నటిస్తోన్న కల్కి 2898 ఏడీ మూవీలో జూనియర్ ఎన్టీఆర్, నేచురల్ స్టార్ నాని నటిస్తున్నారనే వార్త తెగ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాపై ఇప్పుడు భారీ అంచనాలు ఉన్నాయి. దీని రేంజ్ ఏంటో గ్లింప్స్ తో చూపించడం.. డిఫరెంట్ గా ప్రమోట్ చేస్తుండడం.. ఇప్పటి వరకు తెరపై రాని కథతో సినిమా చేస్తుండడం కారణంగా కల్కి పై అంచనాలు భారీగా ఉన్నాయి. మే 9న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. వాయిదా అంటూ ప్రచారం జరుగుతోంది కానీ.. మే 9న కల్కి రావడం మాత్రం కన్ ఫర్మ్ అని సమాచారం.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ గెస్ట్ రోల్ చేస్తున్నట్టుగా గతంలో వార్తలు వచ్చాయి. అలాగే మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా నటిస్తున్నాడని టాక్ వచ్చింది. తాజాగా ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ నటిస్తున్నాడని.. క్లైమాక్స్ లో ఎన్టీఆర్ పరశరాముడుగా కనిపిస్తాడని.. ఇక కృష్ణాచార్యుడి పాత్రలో నేచురల్ స్టార్ నాని కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇది నిజమో కాదో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త వైరల్ అయ్యింది. ఇదే కనుక నిజమైతే.. కల్కి సంచలనమే.

ఇందులో అమితాబ్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. కమల్ హాసన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. ప్రభాస్ కు జంటగా దీపికా పడుకునే, దిశా పటానీ నటిస్తున్నారు. సుప్రసిద్ధ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ ఏమాత్రం రాజీపడకుండా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భారతదేశంలోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందుతోన్న సినిమా ఇది. అమెరికా, ముంబాయిలో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన కల్కి త్వరలో హైదరబాద్ లో కూడా ప్రమోషన్స్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సమ్మర్ లో వస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ కల్కినే. మరి.. కల్కి చరిత్ర సృష్టిస్తాడేమో చూడాలి.

Also Read: Jai Hanuman: ప్రశాంత్‌వర్మ దర్శకత్వంలో చిరు, మహేష్ కాంబో..