Site icon HashtagU Telugu

NTR Jayanti : ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూ. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ నివాళులు

Jr NTR About Kalyan Ram

Jr NTR About Kalyan Ram

నేడు (మే 28) నందమూరి తారక రామారావు 101వ జయంతి (NTR Jayanti). ఈ సందర్భాంగా ఆయన మనవళ్లు జూ.ఎన్టీఆర్ (Jr NTR), కళ్యాణ్ రామ్ (Kalyan Ram) హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. తెల్లవారు జామునే ఘాట్ వద్దకు చేరుకొని నివాళ్లు అర్పించారు. అలాగే ఎన్టీఆర్ అభిమానులు , నందమూరి అభిమానులు సైతం పెద్ద ఎత్తున అక్కడికి వచ్చి జై ఎన్టీఆర్, సీఎం అంటూ నినాదాలు చేశారు. నందమూరి తారక రామారావు అంటే తెలియని తెలుగు వారెవరూ ఉండరంటే అతిశయోక్తి కాదేమో. నటుడిగా, నాయకుడిగా ఆయన ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. రాముడు, కృష్ణుడు అంటే చాలా మందికి గుర్తొచ్చేది ఆయన రూపమే. ‘అన్నగారు’ అని అందరూ ఆప్యాయంగా తలుచుకునే వ్యక్తి ఆయన. సినీరంగంలో, రాజకీయ రణరంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించి తనకంటూ ఒక శకాన్ని సృష్టించుకున్న ‘యుగ పురుషుడు’ ఎన్టీఆర్.

We’re now on WhatsApp. Click to Join.

అలాంటి ఎన్టీఆర్ జయంతిని మంగళవారం రెండు తెలుగు రాష్ట్రాల్లోని తెలుగు తమ్ముళ్లు ఘనంగా నిర్వహించనున్నారు. సాధారణంగా ఏటా ఈ సమయంలో టీడీపీ మహానాడు పెద్దఎత్తున జరుగుతుంది. ముఖ్యనేతలంతా మహా నాడులో పాల్గొంటే గ్రామ, మండల స్థాయి నాయ కులు, ఎన్టీఆర్‌ అభిమానులు స్థానికంగా ఎక్కడికక్కడ కార్యక్రమాలను నిర్వహిస్తారు. అయితే ఈ ఏడాది సాధారణ ఎన్నికల నేపథ్యంలో కోడ్‌ అమలులో ఉంది. దీంతో పార్టీ అధిష్ఠానం మహానాడును వాయిదా వేసి జిల్లాస్థాయి నుంచి గ్రామస్థాయి వరకూ ఎక్కడికక్కడ కార్యక్రమాల నిర్వహణకు పిలుపునిచ్చింది. అయితే అలా కూడా సాఫీగా నిర్వహించేందుకు కోడ్‌ అడ్డం కిగా మారింది. ఎన్నికల కోడ్‌ అమలు నేపథ్యంలో అన్నిరకాల రాజకీయ నాయకుల విగ్రహాలకు యంత్రాంగం ముసుగులు వేయడంతోపాటు ఆయా ప్రాంతాల్లో సభలు, సమావేశాల నిర్వహణను రద్దు చేశారు. దీంతో ఈసారి ఎన్టీఆర్ జయంతి ని పెద్దగా ఆర్బాటం లేకుండా కానిస్తున్నారు.

Read Also : Moles Health Problems : పుట్టుమచ్చల్లాంటి మచ్చలొస్తున్నాయా ? ఈ రోగాలు రావొచ్చు..