Site icon HashtagU Telugu

Devara : దేవర రెండో పార్ట్ ను ప్రకటించిన కొరటాల శివ

Devara 2nd Part

Devara 2nd Part

జూ.ఎన్టీఆర్ (NTR) – జాన్వీ కపూర్ (Janhvi Kapoor) జంటగా కొరటాల శివ (Koratala Shiva) డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ దేవర (Devara). యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ లో బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) విలన్ నటిస్తుండగా..అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ తాలూకా కీలక అప్డేట్ ను డైరెక్టర్ కొరటాల శివ ప్రకటించి అభిమానుల్లో ఉత్సాహం నింపారు. ఈ సినిమాను రెండు పార్ట్స్ గా తెరకెక్కించబోతున్నట్లు తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సినిమాలో ఎన్నో బలమైన పాత్రలున్నాయని, షూటింగ్ జరుగుతున్న తర్వాత రోజురోజుకు పెద్దదైపోయిందని, కొన్ని షెడ్యూల్స్ షూటింగ్ ఔట్ పుట్ తో తమలో ఇంకా ఉత్సాహం కలిగిందన్నారు. నిడివిన దృష్టిలో ఉంచుకొని ఒక్క సన్నివేశంకానీ, ఒక్క సంభాషణ కానీ తొలగించలేని పరిస్థితి వచ్చిందన్నారు. ఏ ఒక్కటి కూడా తొలగించలేమని తామంతా భావించినట్లు వెల్లడించారు. ఒక్క భాగంలోనే ఇంత పెద్ద కథను ముగించేయాలనుకోవడం కూడా తప్పే అన్న నిర్ణయానికి వచ్చామని, పాత్రలు, వాటి భావోద్వేగాలను పూర్తిస్థాయిలో చూపించాలంటే ఒక్క భాగంతో కుదరదని, అందరితో చర్చించి పార్ట్ 2 నిర్ణయం తీసుకున్నామన్నారు.

Read Also : Hyderabad: హైదరాబాద్ లో చూడదగ్గ 3 ప్రదేశాలు

దేవర సినిమా కథ రాసుకున్నప్పుడు, ఎన్టీఆర్‌కి ఈ కథ చెప్పినప్పుడు అందరూ ఏదో తెలియని ఎగ్జయిట్‌మెంట్, హై ఫీలయ్యామని .. ఈ సినిమా ఒక కొత్త ప్రపంచమని.. చాలా పెద్ద కాన్వాస్, శక్తివంతమైన ఎన్నో పాత్రలు ఉండడం వల్ల సినిమాకు ఆ స్థాయి ఏర్పడిందని కొరటాల చెప్పుకొచ్చారు. తాను గతంలో చెప్పినట్టు సముద్ర తీర ప్రాంతంలో భయం అనే ఎమోషన్‌ను చాలా శక్తివంతమైన పాత్రలతో చెప్పే కథ ‘దేవర’ అని కొరటాల శివ అన్నారు. ఇంత శక్తివంతమైన సినిమాను రెండు భాగాలుగా చెప్పబోతున్నామన్నారు. ఈ సినిమా ద్వారా ప్రేక్షకులు కచ్చితంగా ఒక కొత్త ప్రపంచంలో ప్రయాణం చేస్తారని.. ఈ విషయంలో తనపై పూర్తి నమ్మకం ఉంచాలని కొరటాల హామీ ఇచ్చారు. వచ్చే ఏప్రిల్ 05 న ఫస్ట్ పార్ట్ ను విడుదల చేయబోతున్నట్లు ఈ సందర్బంగా ప్రకటించారు.