Devara : పది ఊర్లకు కాపరిగా ఎన్టీఆర్.. ‘వైకింగ్స్’లా అనిపిస్తుందేంటి ‘దేవర’ స్టోరీ లైన్..

దేవరలో పది ఊర్లకు కాపరిగా ఎన్టీఆర్ కనిపించబోతున్నారా..? గ్లింప్స్ అండ్ సాంగ్ లో కనిపిస్తున్న పాయింట్స్ కూడా వైకింగ్స్ కథనే గుర్తుకు చేస్తున్నాయి.

  • Written By:
  • Publish Date - May 25, 2024 / 01:39 PM IST

Devara : ఎన్టీఆర్ హీరోగా కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘దేవర’. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందుతుంది. మొదటి భాగం అక్టోబర్ లో రిలీజ్ కాబోతుంది. కాగా ఈ మూవీ నుంచి మేకర్స్.. కొన్ని పోస్టర్స్‌ని, గ్లింప్స్ మరియు ఒక సాంగ్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. వీటితో మూవీ పై మంచి బజ్ నే క్రియేట్ చేసారు. కాగా రీసెంట్ గా ఈ మూవీ సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ఆ వీడియోలో ఓ జూనియర్ ఆర్టిస్ట్ మాట్లాడుతూ.. తాను దేవర సినిమాలో నటించినట్లు చెప్పుకొచ్చాడు. ఈ మూవీలో ఎన్టీఆర్ సముద్రం ఒడ్డున ఉన్న పది ఊర్లకు కాపరిగా కనిపించబోతున్నారట. ఆ పది ఊర్లోని జనాలను కాపాడుకోవడం కోసం సముద్రం ఒడ్డున దేవర సృష్టించిన రక్తపాతం ఆడియన్స్ ని థ్రిల్ చేస్తుందని చెప్పుకొచ్చాడు. కాగా ఈ స్టోరీ లైన్ వింటుంటే.. హాలీవుడ్ లో వచ్చిన ‘వైకింగ్స్’ స్టోరీ గుర్తుకు వస్తుంది.

వైకింగ్స్ కథ విషయానికి వస్తే.. రాగ్నార్ లోథ్‌బ్రోక్ అనే ఒక వ్యక్తి సముద్రం ఒడ్డున ఉన్న కొన్ని గ్రామాలకు కాపరిగా ఉంటాడు. వాళ్ళకి ఆపదు వచ్చినప్పుడు వారికీ ధైర్యంగా ఉంటాడు. ఇక వీళ్ళు బ్రతకడం కోసం సముద్రం దాటి వేరే దీవుల్లోకి వెళ్లి అక్కడ దొంగతనానికి పాల్పడుతుంటారు. దేవర నుంచి రిలీజైన గ్లింప్స్ అండ్ సాంగ్ లో గమనిస్తే.. ఎన్టీఆర్ అండ్ గ్యాంగ్ కూడా దొంగతనాలు చేస్తూ కనిపిస్తున్నారు.

రీసెంట్ వీడియోలో జూనియర్ ఆర్టిస్ట్ చెప్పిన పాయింట్, గ్లింప్స్ అండ్ సాంగ్ లో కనిపిస్తున్న కొన్ని పాయింట్స్.. వైకింగ్స్ కథనే గుర్తుకు చేస్తుంది. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ ని చూసిన కొంతమంది, ఈ విషయాన్ని మాట్లాడుతూ.. దేవరని వైకింగ్స్ తో పోలుస్తున్నారు. మరి కొరటాల శివ దేవర సినిమాని వైకింగ్స్ స్ఫూర్తితోనే తెరకెక్కిస్తున్నారా లేదా అనేది వేచి చూడాలి.