Site icon HashtagU Telugu

Janhvi Kapoor : దేవర షూటింగ్‌లో జాన్వీ కోసం ఎన్టీఆర్ ఫుడ్ ఫీస్ట్.. పిక్ వైరల్..

Jr Ntr, Janhvi Kapoor, Devera

Jr Ntr, Janhvi Kapoor, Devera

Janhvi Kapoor : బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ దేవర సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీని కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లో జాన్వీ కపూర్ కూడా పాల్గొన్నారు. ఇక ఆ మూవీ సెట్స్ నుంచి ఓ ఫోటోని జాన్వీ కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా షేర్ చేసారు. ఆ పిక్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.

ఆ ఫొటోలో ఏమి కనిపిస్తున్నాయంటే.. బిరియానీతో పాటు ఫుల్ నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నాయి. ఆ ఫోటోని షేర్ చేస్తూ, జాన్వీ ఇలా రాసుకొచ్చారు.. ‘దేవర షూటింగ్ చేయడానికి నేను ఇష్టపడతాను’ అంటూ చెప్పుకొచ్చారు. ఆ ఫుడ్ ఐటమ్స్ అన్ని చూస్తుంటే ఎన్టీఆర్ ఇంటి నుంచి వచ్చినట్లు తెలుస్తుంది. గతంలో ఎన్టీఆర్ తో కలిసి పని చేసిన చాలామంది నటీనటులు.. ఎన్టీఆర్ అమ్మ బిరియానీ గురించి చెబుతుంటారు. ఇప్పుడు జాన్వీ కూడా అలాగే బిరియానీ వచ్చినట్లు తెలుస్తుంది. ఆ ఫోటో వైపు మీరు ఓ లుక్ వేసేయండి.

ఇక దేవర షూటింగ్ విషయానికి వస్తే.. ప్రస్తుతం పాటల చిత్రీకరణ జరుగుతున్నట్లు తెలుస్తుంది. అనిరుద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఒక సాంగ్ రిలీజయ్యి సూపర్ హిట్టుగా నిలిచింది. ఇప్పుడు రెండో సాంగ్ ని రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు. ఈ రెండో పాట రొమాంటిక్ మెలోడీ అని తెలుస్తుంది. ఎన్టీఆర్ అండ్ జాన్వీ పై అందమైన బీచ్ ఒడ్డున చిత్రీకరించిన ఈ మెలోడీ సాంగ్ అద్భుతంగా ఉంటుందని టాక్ వినిపిస్తుంది.