Site icon HashtagU Telugu

Jr NTR Tweet: మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది!

Jr NTR

Jr NTR

మహానాయకుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు జయంతి. ఈ నేపథ్యంలో తాతాను తలుచుకుంటూ…జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా సదా మిమ్మల్ని స్మరించుకుంటూ అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు. మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోది..పెద్ద మనస్సుతో ఈ ధరిత్రని.. ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాతా…సదా మీ ప్రేమకు బానిసను అంటూ…ట్విట్టర్ లో పోస్టు చేశారు.

ఇదిలా ఉండగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో తమ అభిమాన నాయకుడు, నటుడు దేవుడిగా కొలుస్తున్నారు. అటు సినీ ఇండస్ట్రీతోపాటు ఇటు రాజకీయవేత్తలు కూడా తారకరామున్ని కొనియాడుతున్నారు. ఎన్టీఆర్ ఘాట్ కు ప్రముఖులు బారులు తీరుతున్నారు.