Site icon HashtagU Telugu

Devara : దేవర నుంచి రానున్న పాటల్లో ఎన్టీఆర్ డాన్స్ ఓ రేంజ్‌లో..!

Jr Ntr, Devara, Janhvi Kapoor

Jr Ntr, Devara, Janhvi Kapoor

Devara : ఎన్టీఆర్, జాన్వీ క‌పూర్ హీరోహీరోయిన్స్ గా తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా ‘దేవర’. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కళ్యాణ్ రామ్.. రెండు భాగాలుగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మరో నెల రోజుల్లో ఈ మూవీ మొదటి భాగం రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఆ మూవీ ప్రమోషన్స్ ని కూడా మొదలు పెట్టింది మూవీ టీం. ఈ నేపథ్యంలోనే టీజర్ తో పాటు రెండు సాంగ్స్ ని కూడా రిలీజ్ చేసారు. అయితే ఆ రెండు పాటల్లో డాన్స్ పెద్దగా కనిపించలేదు.

ఎన్టీఆర్ సినిమాలోని పాటలు అంటే అభిమానులు ఓ రేంజ్ డాన్స్ స్టెప్పులను ఆశిస్తారు. పైగా నాటు నాటు సాంగ్ తో డాన్స్ విషయంలో ఎన్టీఆర్ ఓ రేంజ్ పాపులారిటీని సంపాదించుకున్నారు. మరి ఆ పాపులారిటీని మ్యాచ్ చేయాలంటే.. దేవరలో అంతకుమించి డాన్స్ స్టెప్పులు ఉండాలి. అయితే ఇప్పటివరకు రిలీజ్ చేసిన రెండు పాటల్లో అలంటి స్టెప్పులు లేకపోవడంతో ఫ్యాన్స్ కొంత నిరాశ చెందారు. కానీ తరువాత వచ్చే పాటల్లో మాత్రం ఎన్టీఆర్ డ్యాన్స్ ఓ లెవెల్ లో ఉంటుందని సమాచారం.

సినిమాలో రెండు డాన్స్ నెంబర్ పాటలు ఉన్నాయంట. ఆ పాటల్లో ఎన్టీఆర్ డాన్స్ అదిరిపోతుందని చెబుతున్నారు. తరువాత రిలీజ్ కాబోయే మూడో లిరికల్ పాటలో.. ఆ సూపర్ డాన్స్ స్టెప్పులను చూపించబోతున్నారని ఫిలిం వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. మరి రిలీజ్ కాబోయే ఆ రెండు పాటల సంగీతం ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి. కాగా ఈ మూవీ మొదటి భాగం సెప్టెంబ‌ర్ 27న రిలీజ్ కాబోతుంది.