Site icon HashtagU Telugu

Jr. NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పండగే.. జూ.ఎన్టీఆర్‌, హృతిక్‌ రోషన్‌ మల్టీస్టారర్‌ మూవీ..?

Jr. NTR

Resizeimagesize (1280 X 720) (3)

బ్లాక్‌బస్టర్ యాక్షన్ వార్ మూవీ సీక్వెల్‌లో నటించడానికి జూనియర్ ఎన్టీఆర్ (Jr. NTR) నటించనున్నట్లు సమాచారం. బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్‌తో తారక్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించనున్న వార్ 2 మూవీ ఈ సంవత్సరం చివరి నాటికి సెట్స్‌పైకి వెళ్లనుంది. స్పై యూనివర్స్‌ మూవీ ‘వార్‌-2’ లో హృతిక్‌ రోషన్‌తో పాటు జూ.ఎన్టీఆర్‌ కూడా నటించబోతున్నట్లు ఓ ప్రముఖ సంస్థ తన కథనంలో పేర్కొంది. యష్‌ రాజ్‌ ఫిలిమ్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం జూ.ఎన్టీఆర్‌ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్టీఆర్‌-30 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. హృతిక్‌-జూ. ఎన్టీఆర్‌ కాంబోపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Also Read: Rashmika Mandanna Birthday Special : రష్మిక మందన్న పుట్టినరోజు నేడు, ఆమె కెరీర్‎లో బిగ్గెస్ట్ హిట్ మూవీస్ ఇవే.

ప్రస్తుతం ఎన్టీఆర్ 30 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు తారక్. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తోంది. ఫస్ట్ షెడ్యూల్ లోనే ఈసినిమాకు సబంధించిన భారీ యాక్షన్ సీన్స్ ను కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు కొరటాల. దానికోసం హాలీవుడ్ నుంచి యాక్షన్ కొరియోగ్రఫర్స ను కూడా రంగంలోకి దించాడు. ఈ మూవీ అయినా తర్వాత తారక్, హృతిక్‌ రోషన్‌ తో కలిసి వార్ 2 మూవీలో నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

‘వార్ 2’లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మధ్య సన్నివేశాలు ‘నువ్వా నేనా’ అన్నట్టు ఉంటాయని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. యశ్ రాజ్ ఫిల్మ్స్ సన్నిహిత వర్గాలు ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. అవును ‘వార్ 2’లో నటించేందుకు ఎన్టీఆర్ అంగీకరించారు. ఇది నిజమైన పాన్ ఇండియా ఫిల్మ్” అని తెలిపాయి. ‘వార్’లో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటించారు. సినిమాలో ఇద్దరి మధ్య భారీ యాక్షన్ సీక్వెన్సులు ఉంటాయి. ఇద్దరూ పోటా పోటీగా నటించారు. చివరకు, టైగర్ ష్రాఫ్ క్యారెక్టర్ మరణించినట్టు చూపించారు. అయితే, ఆ సినిమాకు సీక్వెల్ ఉంటుందని యశ్ రాజ్ ఫిల్మ్స్ గతంలో ప్రకటించింది.