Site icon HashtagU Telugu

Jr NTR Looks: ఇంతలో ఎంత మార్పు.. ఎన్టీఆర్ లుక్స్ అదుర్స్!

Ntr1

Ntr1

కేవలం 10 రోజుల్లో ఎన్టీఆర్‌లో పెద్ద మార్పు కనిపించింది. విపరీతమైన బరువు పెరిగిన ఎన్టీఆర్ కొద్దిరోజుల్లో తన బాడీషేప్ ను మార్చుకొని అందర్నీ మెస్మరైజ్ చేశాడు. 10 రోజుల క్రితం, అమిత్ షాను కలిసిన ఎన్టీఆర్ బొద్దుగా కనిపించాడు. గడ్డం పెంచుకొని లుక్ చెదిరినట్టుగా కనిపించాడు. అయితే ఎన్టీఆర్ RRR కొమురంభీం కోసం తన లుక్ ను మార్చుకున్నాడు. ఆ సినిమా పూర్తయిన ఎన్టీఆర్ లో ఎలాంటి మార్పు కనిపించలేదు. దీంతో ఆయన అభిమానులు లుక్స్ పై కామెంట్ చేశారు.

గత రాత్రి బ్రహ్మాస్త్ర ప్రమోషనల్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ అందర్నీ ఆకట్టుకున్నాడు. ఊహించని స్లిమ్ అయ్యాడు. ఆ లుక్ అరవింద్ సమేతలో మాదిరిగా ఉంది. కేవలం 10 రోజుల తర్వాత స్లిమ్‌గా కనిపించగలిగే ఏకైక హీరో ఎన్టీఆర్‌ మాత్రమే. అతను ఏం చేశాడో తెలియదు కానీ మమ్మల్ని మాత్రం ఆశ్చర్యపర్చాడు అని ఎన్టీఆర్ అభిమాని ట్వీట్ చేశాడు. ఇక ఎన్టీఆర్ 30  సినిమా త్వరలోనే ప్రారంభంకానుంది.

 

Exit mobile version