Adhurs Re-Release: రీ రిలీజ్ కు సిద్ధమైన అదుర్స్.. ఎప్పుడంటే..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ వి.వి. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ అదుర్స్ రీ రిలీజ్ (Adhurs Re-Release)కి రెడీ అయిపోయింది.

Published By: HashtagU Telugu Desk
Adhurs Re-Release

Compressjpeg.online 1280x720 Image 11zon

Adhurs Re-Release: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో రీ రిలీజ్ సినిమాల హవా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి హీరోల సినీ కెరియర్ లో ది బెస్ట్ సినిమాగా ఉన్నటువంటి సినిమాలను తిరిగి ప్రేక్షకుల ముందుకు 4కె వెర్షన్లు తీసుకువస్తున్నారు. ఈ క్రమంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ వి.వి. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ అదుర్స్ రీ రిలీజ్ (Adhurs Re-Release)కి రెడీ అయిపోయింది. జూనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ లో 23 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.

నవంబర్ 18, 2023 న అదుర్స్ సినిమా వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రీ రిలీజ్ కానుంది. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై వల్లభనేని వంశీ, కొడాలి నాని నిర్మించిన ఈ చిత్రంలో నయనతార, షీలాలు లీడ్ రోల్స్ లో నటించారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. 13 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ కానున్న ఈ సినిమా ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

Also Read: Pawan Kalyan Disappointed : అవనిగడ్డ లో పవన్ వెనక్కు తగ్గాడా..? కారణం ఏంటి..?

We’re now on WhatsApp. Click to Join

ఈ సినిమా 4k వెర్షన్ లో నవంబర్ 18న విడుదలకు సిద్ధం కాబోతోందని తెలుస్తోంది. ఇలా ఈ సినిమా విడుదల కాబోతోందనే విషయం తెలియడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బ్రహ్మానందం అదిరిపోయే కామెడీ పాత్రలో నటించి మెప్పించారు. తన మార్క్ కామెడీ తో అదరగొట్టేశారు. 2010లో విడుదలైన అదుర్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మంచి కలెక్షన్ లను కూడా రాబట్టింది. ఈ మూవీ ద్వారా ఎన్టీఆర్ వి వి వినాయక్ లకు మంచి గుర్తింపు లభించింది. దీనికి వల్లభనేని వంశీ మోహన్ నిర్మాతగా వ్యవహరించారు.ఇక ఇప్పుడు ఈ సినిమా రీ రిలీజ్ కు రెడీ అయ్యింది. మరి ఈ సినిమా కలెక్షన్స్ ఎరేంజ్ లో రాబడుతుందో చూడాలి.

  Last Updated: 02 Oct 2023, 02:14 PM IST