Site icon HashtagU Telugu

Mohan Babu Attack on Media : మోహన్ బాబు దాడిలో జర్నలిస్ట్ రంజిత్‌కు బోన్ ఫ్యాక్చర్

Manchu Mohan Babu

Manchu Mohan Babu

మీడియా జర్నలిస్ట్ పై మోహన్ బాబు దాడి చేయడం పై యావత్ మీడియా నే కాదు సినీ ప్రముఖులు , ప్రజలు , అభిమానులు అలాగే అయ్యప్ప భక్తులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీడియా పై దాడి చేయడమే తప్పు..అందులో అయ్యప్ప మాల ధరించిన స్వామి పై దాడి చేయడం పెద్ద తప్పు అని..ఖచ్చితంగా మోహన్ బాబు మూల్యం చెల్లించుకుంటాడని శాపనార్దాలు పెడుతున్నారు. ప్రస్తుతం మోహన్ బాబు దాడిలో గాయపడిన జర్నలిస్ట్ రంజిత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. జైగోమాటిక్ ఎముక మూడు చోట్ల విరిగినట్లు వైద్యులు తెలిపారు.

మంగళవారం జల్‌పల్లిలో తన నివాసం వద్ద జరుగుతున్న గొడవను మీడియా కవరేజ్ కోసం వచ్చిన రంజిత్ తలపై మోహన్ బాబు మైక్‌తో బలంగా కొట్టారు. ఈ దాడిలో రంజిత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటనపై జర్నలిస్ట్ సంఘాలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మీడియా ప్రతినిధులపై దాడి చేయడం అప్రజాస్వామిక చర్యగా అభివర్ణించారు. మోహన్ బాబు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. గాయపడిన రంజిత్ ప్రస్తుతం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పవిత్ర అయ్యప్ప మాల ధరించిన వ్యక్తిపై దాడి చేయడం హేయమైన చర్యగా భక్తులు పరిగణిస్తున్నారు. మోహన్ బాబు అహంకారపూరితంగా వ్యవహరించారని పలువురు విమర్శించారు. ఈ సంఘటనపై సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. టీఎస్ జర్నలిస్ట్ సంఘం, బీసీ జర్నలిస్టుల అసోసియేషన్ వంటి సంస్థలు మోహన్ బాబు దాడిని ఖండించాయి. తెలంగాణ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, కేఏ పాల్ వంటి రాజకీయ నాయకులు కూడా మోహన్ బాబు చర్యను తీవ్రంగా విమర్శించారు.

Read Also : CM Chandrababu : సమర్ధవంతమైన పరిపాలన కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించుకోవాలి