జానీ మాస్టర్ కు మరోసారి భారీ షాక్ తగలబోతోంది. ఇప్పటికే నేషనల్ అవార్డు రద్దయింది..ఇకప్పుడు బెయిల్ కూడా రద్దయే అవకాశం కనిపిస్తుంది. అత్యాచారం ఆరోపణల కేసులో జానీ మాస్టర్ (Johnny Master) ను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. జానీ మాస్టర్ గత కొంతకాలంగా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు పిర్యాదు చేసిన నేపథ్యంలో జానీని అరెస్ట్ చేసి కోర్ట్ లో హాజరు పరచగా..14 రోజుల రిమాండ్ విధించింది.
దీంతో బెయిల్ (Jani Master Bail) కోసం జానీ కోర్ట్ ను ఆశ్రయించారు. తనకు నేషనల్ అవార్డు (Jani Master National Award) వచ్చిందని..దీని స్వీకరించేందుకు గాను తనకు బెయిల్ ఇవ్వాలని కోరును కోరడం తో.. రంగారెడ్డి కోర్టు ఆయనకు అవార్డు తీసుకోవడానికి 4 రోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే కొరియోగ్రాఫర్‌పై అత్యాచారం కేసు నేపథ్యంలో జానీ మాస్టర్ కి జాతీయ అవార్డును నిలిపివేశారు. దీంతో జానీమాస్టర్ బెయిల్ ను రద్దు చేయాలంటూ పోలీసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారు. దీంతో ఆయనను మళ్లీ రిమాండ్‌కు తరలించే అవకాశాలు ఉన్నాయి.
మరోపక్క జానీ నేషనల్ అవార్డు ఇవ్వలందే అని పలువురు డాన్సర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కేసు ఇంకా కోర్ట్ లో ఉందని..అతడు తప్పు చేసినట్లు ఎక్కడ రుజువు కాలేదని..అలాంటప్పుడు అతడికి దక్కాల్సిన అవార్డు ను నిలిపివేయడం మంచిది కాదని అంటున్నారు. తాజాగా దీనిపై కొరియోగ్రాఫర్, బిగ్‍బాస్ ఫేమ్ ఆట సందీప్ స్పందించారు. అవార్డును వెనక్కి తీసుకోవడం సరికాదంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు.
“జానీ మాస్టర్‌కు నేషనల్ అవార్డ్ క్యాన్సిల్ అయందని సోషల్ మీడియాలో చూశా. చాలా బాధగా అనిపించింది. ఓ ఆడపిల్ల విషయం, సెన్సిటివ్ విషయం అని ఇంతకాలం నేను జానీ మాస్టర్ అంశంలో మాట్లాడలేదు. వాళ్లకి వాళ్లకి ఏదో ఉండొచ్చు. లీగల్‍గా జానీ మాస్టర్ ప్రొసీడ్ అవుతారని అనుకున్నా. కానీ ఈరోజు జానీ మాస్టర్‌కు నేషనల్ అవార్డు క్యాన్సిల్ చేసే రేంజ్‍కు వెళ్లిపోయిందంటే చాలాచాలా బాధపడుతున్నా” అని సందీప్ అన్నారు. డ్యాన్స్ మాస్టర్‌గా కొరియోగ్రాఫర్ల కష్టాలు తనకు తెలుసని, జానీ ఎంత కష్టపడి ఉండే జాతీయ అవార్డుకు ఎదిగి ఉంటారని, నోటి దగ్గరి దాన్ని కాలితో తన్నారని బాధ పడ్డారు.
Read Also : Sri Lanka Election Fever: శ్రీలంకపై చైనా ప్రభావం.. ఆ దేశంలో ఎన్నికలకు ముందు భారీగా పెట్టుబడులు!