సినీ పరిశ్రమలో అన్ని విభాగాలకు యూనియన్స్ ఉన్నాయి. అలాగే డ్యాన్సర్లు(Dancers), డ్యాన్స్ కొరియోగ్రాఫర్స్(Dance Choreographers) కి కూడా యూనియన్ ఉంది. ‘తెలుగు ఫిలిం అండ్ టీవీ డ్యాన్సర్స్– డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్’ పేరుతో ఈ యూనియన్ నడుస్తుంది. ఒకప్పటి డ్యాన్స్ మాస్టర్ ముక్కురాజు ఈ యూనియన్ ని కొన్నాళ్ల క్రితం స్థాపించారు. ఇటీవల మరణించిన రాకేష్ మాస్టర్(Rakesh Mastar) కూడా ఈ యూనియన్ కోసం కష్టపడ్డారు.
ఇటీవల రాకేష్ మాస్టర్ మరణించిన అనంతరం డ్యాన్స్ యూనియన్ ని విస్తరించాలని, మరింతమందికి కార్డులు ఇవ్వాలని.. ఇలా పలు కార్యక్రమాలతో యాక్టివ్ గా మారింది. తాజాగా ఈ ‘తెలుగు ఫిలిం అండ్ టీవీ డ్యాన్సర్స్– డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్’ యూనియన్ ఎన్నికలు జరగగా ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్(Johnny Master) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
ఫిలిం ఛాంబర్ లో ఈ కార్యక్రమం జరగగా డ్యాన్సర్స్ యూనియన్ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జానీ మాస్టర్ మాట్లాడుతూ.. వేరే సినీ పరిశ్రమ డ్యాన్సర్లకు మనం అవకాశాలు ఇస్తున్నాం, వాళ్ళు కూడా వచ్చినందుకు సంతోషంగా ఉంది. మా యూనియన్ సొంత స్థలం, భవనం కోసం పనిచేస్తాను. ఈ రోజు మాకు డ్యాన్స్ మాస్టర్ గా ఇంత పేరు, డబ్బు రావడానికి కారణం, ఈ యూనియన్ నడవడానికి కారణం ముక్కురాజు మాస్టర్. మా తరపున ఆయన వారసురాలి 2 లక్షల రూపాయలు చిరు కానుక ఇస్తున్నాం అని తెలిపారు.
ఇప్పటివరకు ఏ యూనియన్ అయినా స్టార్స్ గా ఉండి, బిజీగా ఉన్నవాళ్లు యూనియన్ లో పదవులు తీసుకోవడం చాలా తక్కువ. జానీ మాస్టర్ ప్రస్తుతం అన్ని పరిశ్రమల నుంచి సినిమాలతో బిజీగా ఉన్నారు. మరి జానీ మాస్టర్ అధ్యక్షుడి హోదాలో ‘తెలుగు ఫిలిం అండ్ టీవీ డ్యాన్సర్స్– డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్’ ని ఎలా నడిపిస్తారో చూడాలి.
Also Read : Jr NTR: జయహో జూనియర్, ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచిలో ఎన్టీఆర్ కు సభ్యత్వం