కథ: కార్తిక్ (కృష్ణ బూరుగుల), ప్రవీన్ (రామ్ నితిన్), వినయ్ (ధీరజ్ ఆత్రేయ), ప్రశాంత్ (మనీ వాక) నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్. ఓ రాత్రి తాగిన మత్తులో గోవా ట్రిప్‌కు మారుతీ 800లో వెళ్లాలని నిర్ణయించుకుంటారు. ఆ నిర్ణయం తీసుకున్న వెంటనే బయలుదేరతారు. కానీ ప్రయాణంలో కారు ట్రబుల్ ఇస్తుంది. దాన్ని రిపేర్ చేసే క్రమంలో ఓ ఆసక్తికరమైన వ్యక్తి జీవితంలోకి వస్తాడు. అక్కడి నుండి తిరిగి ప్రయాణం మొదలవుతుంది. అసలు ఆ చిన్న కారులోనే ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? గోవా చేరుకున్నారా? ఆ ప్రయాణం వీరి జీవితాల్లో ఏమి మార్పులు తీసుకువచ్చింది? అనేదే మిగిలిన కథ.
Jubilee Hills Bypoll Counting : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భారీ ఆధిక్యం దిశగా కాంగ్రెస్
నటీనటులు & టెక్నికల్ పనితీరు : కృష్ణ బూరుగుల తన ఎనర్జీతో సినిమా మొత్తాన్ని స్టీల్ చేశాడు. రామ్ నితిన్ బాగానే చేశాడు. ధీరజ్ ఆత్రేయ చాలా సహజంగా, అమాయకంగా కామెడీ పండించాడు. మనీ వాక పాత్ర సినిమాకి హార్ట్‌లాంటిది — ఎమోషన్ సీన్స్‌లో కొంత అనుభవం అవసరమని అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ కలర్ఫుల్‌గా, మ్యూజిక్ (కమ్రాన్) చక్కగా ఉంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ కూడా చక్కగా కనిపిస్తాయి.
విశ్లేషణ: టైటిల్‌కి తగ్గట్టే ఇది నలుగురు జిగ్రీస్ కథే. ఇలాంటి సినిమాల్లో పెద్ద కథ ఉండదు — ఉండాల్సిందల్లా సరదా, స్నేహం, నవ్వులు! ప్రతి సీన్ హిలేరియస్‌గా మలచడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా లారీ సీన్, ఓ ఊర్లో నాటుకోడి ఎపిసోడ్, కాండోమ్ సీన్ పక్కా నవ్వులు పూయిస్తాయి. దొంగల ఎపిసోడ్ కూడా సరదాగా సాగుతుంది. కథలో పెద్ద ట్విస్టులు లేకపోయినా, “ఇది మన ఫ్రెండ్స్ గ్యాంగ్ లాంటిదే కదా!” అనిపించేంత రియలిస్టిక్‌గా ఉంటుంది. అక్కడక్కడా కొంచెం సాగదీత సన్నివేశాలు ఉన్నా కూడా చివరి 15 నిమిషాలు మాత్రం భావోద్వేగంగా మనసుని తాకుతాయి. అలా జరగకపోతే బాగుండేదేమో అనిపించేలా సీన్‌లు హృదయానికి హత్తుకుంటాయి.
చివరగా.. జిగ్రీస్ అనేది మన చిన్ననాటి ఫ్రెండ్స్‌తో గడిపిన ఆ పాగల్ క్షణాలని మళ్లీ గుర్తు చేసే సినిమా. నవ్విస్తూనే హత్తుకునే ఫ్రెండ్‌షిప్ జర్నీ.
రేటింగ్: 3/5
