Site icon HashtagU Telugu

Jigris : ‘జిగ్రీస్’ విడుదల తేదీ ఫిక్స్

Jigris Release Date

Jigris Release Date

యువత కోసం ప్రత్యేకంగా తెరకెక్కిన మరో ఫీల్‌గుడ్ యూత్ ఎంటర్‌టైనర్‌గా ‘జిగ్రీస్’ సిద్ధమవుతోంది. “ఈ నగరానికి ఏమైంది” తరహాలో యూత్‌ఫుల్ ఎమోషన్స్, ఫ్రెండ్‌షిప్, మ్యూజిక్‌లతో నిండిన ఈ చిత్రం నవంబర్ 14న థియేటర్లలో విడుదల కానుంది. ‘మ్యాడ్ స్క్వేర్’ ఫేమ్ రామ్ నితిన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్ర టీజర్‌ను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా విడుదల చేయగా, అద్భుతమైన స్పందనను సొంతం చేసుకుంది. కేవలం మూడు రోజుల్లోనే టీజర్ 2 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి, యువతలో భారీ హైప్ క్రియేట్ చేసింది.

Indiramma Houses : మీరు ఇందిరమ్మ ఇల్లు కడుతున్నారా..? అయితే మీకు షాకింగ్ న్యూస్ !!

హరీష్ రెడ్డి ఉప్పుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మౌంట్ మెరు పిక్చర్స్ బ్యానర్‌పై కృష్ణ వోడపల్లి నిర్మిస్తున్నారు. ఈశ్వర్ ఆదిత్య సినిమాటోగ్రఫీ, చాణక్య రెడ్డి తూర్పు ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టగా, కమ్రాన్ సయ్యద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలోని సంగీతం ఇప్పటికే యువతలో మంచి ఆదరణ పొందుతోంది. టీజర్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ రెండూ పాజిటివ్ బజ్‌ను సృష్టించడంతో, నవంబర్ 14న విడుదల కానున్న ‘జిగ్రీస్’పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి.

 

Exit mobile version