Site icon HashtagU Telugu

494 Crore Mansion : రూ. 494 కోట్ల ఇల్లు కొన్న స్టార్ కపుల్

494 Crore Mansion

494 Crore Mansion

హాలీ వుడ్.. బాలీ వుడ్ .. టాలీ వుడ్.. ఏ వుడ్ అయినా సరే !! మూవీ ఇండస్ట్రీలో ఉన్న సూపర్ స్టార్స్.. ఆస్తుల కొనుగోలులో ఒకరిని మించి మరొకరు అన్నట్టుగా దూసుకు పోతున్నారు.  తాజాగా హాలీవుడ్ పవర్ ఫుల్  కపుల్ నటి జెన్నిఫర్ లోపెజ్, నటుడు బెన్ అఫ్లెక్ అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ఉన్న బెవర్లీ హిల్స్ నడిబొడ్డున అద్భుతమైన భవనాన్ని కొన్నారు. దాని ధర ఏంటో తెలిస్తే మీరు నోరెళ్ళబెడతారు. అక్షరాలా రూ. 494 కోట్లు(494 Crore Mansion). ఈ బ్యూటిఫుల్,  రాయల్ బిల్డింగ్ విలాసవంతమైన సౌకర్యాలతో 5.2 ఎకరాల్లో విస్తరించి ఉంది. రెండు సంవత్సరాల సెర్చింగ్ తర్వాత  లోపెజ్, బెన్ అఫ్లెక్ కపుల్ కు ఈ  ఇల్లు కనిపించిందట. అది బాగా నచ్చడంతో.. ధర  గురించి ఏమాత్రం ఆలోచించకుండా కొనేశారట!!

గత సంవత్సరం జూలైలోనే పెళ్లి

జెన్నిఫర్ లోపెజ్, నటుడు బెన్ అఫ్లెక్ గత సంవత్సరం జూలైలోనే పెళ్లి చేసుకున్నారు. వారు తమ కొత్త  ఇంటి లోపలి ఫోటోలను అభిమానుల కోసం ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్లో షేర్ చేశారు. వీళ్ళు కొన్న భారీ భవనం గత యజమానులు కూడా మహా సంపన్నులే. బిల్డింగ్ పాత యజమానుల లిస్ట్ లో  MGM స్టూడియోస్ మాజీ CEO అలెక్స్ యెమెనిడ్జియాన్ , పోంజీ స్కీమర్ కర్టిస్ సోమోజా  వంటి వారు ఉన్నారు. 2016లో హై-ఎండ్ హౌస్ డెవలపర్ గాలా ఆషెర్ ఈ బిల్డింగ్ కొని దానిని విలాసవంతమైన భవనంగా మార్చారు.

ఎన్నెన్నో వసతులు..

రూ. 494 కోట్ల ఈ భవంతిలో(494 Crore Mansion) ఇండోర్ పికిల్‌బాల్ కోర్ట్, జిమ్, బాక్సింగ్ రింగ్, విశాలమైన స్పోర్ట్స్ కాంప్లెక్స్‌, పూర్తి బహిరంగ వంటగది, అద్భుతమైన 155-అడుగుల ఇన్ఫినిటీ పూల్‌ ఉన్నాయి . 10 కార్లు పట్టే గ్యారేజ్, 80 అదనపు కార్ల కోసం ఆఫ్ స్ట్రీట్ పార్కింగ్‌ వసతి కూడా ఉంది. ఈ కొత్త ఇంటిని కొనే ముందు .. తమ పాత ఇళ్లను జెన్నిఫర్ లోపెజ్, బెన్ అఫ్లెక్ అమ్మేశారు. పసిఫిక్ పాలిసేడ్స్ లో తన ఇంటిని అఫ్లెక్  గత ఏడాది రూ. 230 కోట్లకు విక్రయించగా, లోపెజ్ తన బెల్ ఎయిర్ ఎస్టేట్‌ను రూ. 345 కోట్లకు విక్రయించేందుకు రెడీగా ఉంది.