ప్రస్తుతం సినిమాలోని స్పెషల్ సాంగ్స్ ని కూడా హీరోయిన్సే చేసేస్తున్నారు. కానీ ఒకప్పుడు ఆ స్పెషల్ సాంగ్స్ చేయడానికి ప్రత్యేకంగా వేరే యాక్ట్రెస్ ఉండేవారు. ఇక ఈ తారలకు ఆడియన్స్ లో హీరోయిన్స్ కంటే ఎక్కువ క్రేజ్ ఉండేది. అలా తమ అందాలతో, డాన్స్ టాలెంట్ తో ఎంతో క్రేజ్ ని సంపాదించుకున్న తారలు.. జ్యోతిలక్ష్మి, జయమాలిని, సిల్క్‌స్మిత, విజయలలిత.. ఇలా పలువురు ఉన్నారు.
అయితే వీరికి వచ్చిన ఈ క్రేజ్ తో వారు ఎంతో ఇబ్బంది పడేవారు. సినిమాల్లో వారు చేసేవి ఐటెం సాంగ్స్ కావడంతో.. ఆడియన్స్ ఆయా తారలతో కొంచెం ఇబ్బందికరంగా ప్రవర్తించేవారు. వారిని చూసి ఈలలు వేయడం లేదా దుర్భాషలతో తమ అభిమానాన్ని చూపిస్తూ వచ్చేవారు. అయితే ఇంతకంటే భయంకరమైన పరిస్థితి ఒకటి జయమాలినికి(Jayamalini )ఎదురైందట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.
ఒకసారి ఒక ఊళ్లో నాట్య ప్రదర్శన ఇవ్వడానికి జయమాలిని వెళ్లారట. ఆ నాట్య ప్రదర్శన సినిమా డాన్సులు కాకపోవడంతో వెనక వరుస ఆడియన్స్ గోల చేసి ఆ నాట్యం అక్కర్లేదని ఆపేసారు. నాట్య ప్రదర్శనని ఆపేయడంతో జయమాలిని తన గదికి వెళ్లిపోయారు. ఆమె రూమ్ కి వెళ్లడం గమనించిన ఆడియన్స్.. రూమ్ వైపు పరుగులు తీశారు. అయితే వారిలో ఒక వ్యక్తి మాత్రం కత్తి తీసి కేకలు వేస్తూ వీరంగం చేసాడు.
“ఎవరూ ముందడుగు వేయకండి. నేను జయమాలిని గదికి వెళ్తున్నాను. నా వెనకాల ఎవరైనా వచ్చారో పొడిచి చంపేస్తా” అంటూ బెదిరించాడు. దీంతో అందరూ భయపడిపోయారు. అలా జయమాలిని దగ్గరకి వెళ్లిన ఆ వ్యక్తి.. “జయమాలిని గారు భయపడాల్సిన అవసరం ఏం లేదు. నేను ఎవర్ని ఏం చేయను. మిమ్మల్ని దగ్గరనుండి చూడాలని ఇలా చేశాను. ఇప్పుడు చూసాను. చాలు ఇంకా” అని చెప్పి అక్కడి నుంచి కత్తి ఊపుకుంటూ వెళ్ళిపోయాడట.
అతడు వెళ్ళగానే పోలీసులు వచ్చి జయమాలిని దొడ్డిదారిని తీసుకువెళ్లి కారు ఎక్కించి అక్కడి నుంచి పంపించేశారు. ఇక ఆ ఇన్సిడెంట్ తో జయమాలిని.. మళ్ళీ ఏ ప్రదర్శనలు, పబ్లిక్ ఈవెంట్స్ లో పాల్గొనలేదట. ఇక ప్రస్తుతం జయమాలిని సినిమాలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీతో గడుపుతుంది.
Also Read : Mahesh Babu : మహేష్ బాబు చేయాల్సిన సినిమా.. తరుణ్ చేశాడు..