Site icon HashtagU Telugu

Director Atlee: తండ్రి కాబోతున్న స్టార్‌ డైరెక్టర్‌

Atlee

Jpg (2)

తమిళ స్టార్‌ డైరెక్టర్‌ అట్లీ (Director Atlee) త్వరలోనే తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని ఆయన భార్య, నటి ప్రియ మోహన్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకుంది. ‘‘నేను ప్రెగ్నెంట్‌. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలు కావాలి’’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో బేబీ బంప్‌తో ఉన్న ఫోటోలను షేర్‌చేసింది. అట్లీ (Director Atlee), ప్రియ చాలా సంవత్సరాలు డేటింగ్ చేసిన తర్వాత 9 నవంబర్ 2014న చెన్నైలో గ్రాండ్ వెడ్డింగ్ చేసుకున్నారు.

అట్లీ, ప్రియ కలిసి ప్రొడక్షన్ హౌస్‌ని కూడా ప్రారంభించారు. దాని క్రింద వారు అనేక సినిమాలు చేశారు. పెళ్లయిన 8 ఏళ్ల తర్వాత అ‍ట్లీ దంపతులు పేరెంట్స్‌గా ప్రమోట్‌ కాబోతున్నారు. తమిళ చిత్ర పరిశ్రమలోని ప్రముఖ దర్శకుల్లో అట్లీ కుమార్ ఒకరు. అట్లీ సూపర్ స్టార్ దళపతి విజయ్‌తో కలిసి ‘బిగిల్’, ‘మెర్సెల్’, ‘తేరి’ వంటి అనేక బ్లాక్ బస్టర్ చిత్రాలలో పనిచేశారు.

Also Read: Pawan and Balakrishna: నందమూరి నటసింహంతో ‘మెగా’ పవర్ స్టార్.. ఫ్యాన్స్ కు పూనకాలే!

అట్లీ కుమార్ స్వయంగా సూపర్ స్టార్ షారుక్ ఖాన్‌కి పెద్ద అభిమాని. కింగ్ ఖాన్‌తో సినిమా చేయాలని చాలా కాలంగా కలలు కంటున్నాడు. అయితే అతని కల ఇప్పుడు నెరవేరబోతోంది. అతను షారుఖ్ ఖాన్, నయనతారతో ‘జవాన్’ సినిమా పనిలో ఉన్నాడు. ఇకపోతే.. టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ కూడా తన కుటుంబంలోని కొత్త సభ్యుడిని స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నాడు. రామ్ చరణ్, అతని భార్య ఉపాసన వివాహం అయిన 10 సంవత్సరాల తర్వాత వారు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ శుభవార్తను ఇద్దరూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులతో పంచుకున్న విషయం తెలిసిందే.