Site icon HashtagU Telugu

Atlee Kumar: షారుఖ్ కాళ్లపై పడ్డ డైరెక్టర్ అట్లీ.. అసలేం జరిగిందంటే?

Mixcollage 12 Mar 2024 02 29 Pm 9883

Mixcollage 12 Mar 2024 02 29 Pm 9883

తమిళ దర్శకుడు అట్లీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈయనకు తమిళ ఇండస్ట్రీతో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ రేంజ్ లో ఫాలోయింగ్ ఉందో మనందరికి తెలిసిందే. ముఖ్యంగా షారుఖ్ ఖాన్ తో తెరకెక్కించిన జవాన్ మూవితో బాలీవుడ్ లో భారీగా పాపులారిటీని సంపాదించుకున్నారు అట్లీ. అలాగే దర్శకుడు అట్లీ దర్శకత్వం వహించిన తొలి హిందీ సినిమా కూడా అదే. అట్లీ తన మొదటి బాలీవుడ్ ప్రాజెక్ట్‌ ను కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ తో చేశాడు. గత ఏడాది 2023లో విడుదలై బాక్సాఫీస్ వద్ద వేల కోట్ల రూపాయలు వసూలు చేసింది జవాన్.

అంతేకాకుండా నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన జవాన్ సినిమాకు చాలా అవార్డులు వచ్చాయి. తాజాగా జీ సినీ అవార్డ్స్ 2024 లోనూ జవాన్ సినిమా సత్తా చాటింది. జవాన్ చిత్రానికి దర్శకత్వం వహించినందుకు అట్లీ జీ సినీ అవార్డ్స్ 2024లో ఉత్తమ దర్శకుడు అనే అవార్డును కూడా గెలుచుకున్నారు. అయితే ఈ అవార్డు ప్రదానోత్సవంలో అట్లీ పేరు ప్రకటించగానే అక్కడున్నవారు హోరెత్తించారు. అవార్డును అందుకోవడానికి వేదికపైకి వెళ్లే ముందు అట్లీ షారుక్ ఖాన్ పాదాలకు నమస్కరించాడు. దాన్ని అడ్డుకునేందుకు షారూఖ్ ముందుకొచ్చాడు. తన కాళ్లపై పడేందుకు వచ్చిన దర్శకుడిని షారుక్ ఖాన్ అడ్డుకునే ప్రయత్నం చేశాడు.

 

కింగ్ ఖాన్ పాదాలకు నమస్కరించిన తర్వాతే అట్లీ అవార్డు అందుకున్నాడు. ప్రస్తుతం అందుకే సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. కాగా ప్రస్తుతం అట్లీ వయసు 37 ఏళ్లు. షారుఖ్ ఖాన్ వయసు 58 ఏళ్లు. వీరిద్దరి మధ్య 21 ఏళ్ల గ్యాప్ ఉంది. అట్లీ తన కంటే సీనియర్ అయిన షారుక్ ఖాన్‌కు ఇలా అట్లీ గౌరవం ఇచ్చాడు. కాగా అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో అభిమానులు అట్లీ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా డైరెక్టర్ అట్లీ దర్శకుడిగా పదేళ్లు పూర్తి చేసుకున్నారు. అందులో ఇప్పటి వరకు కేవలం 5 సినిమాలకు మాత్రమే దర్శకత్వం వహించాడు. అతని సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. తమిళ సినిమాలకే దర్శకత్వం వహించిన ఆయన ఇప్పుడు బాలీవుడ్‌లో డిమాండ్‌ క్రియేట్‌ చేశారు.

Exit mobile version