Jawan Collections: జవాన్ మూవీ కలెక్షన్ల సునామీ.. ఒక్క రోజులో రూ.120 కోట్లు..!

బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ (Shah Rukh Khan) నటించిన జవాన్ (Jawan) సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. విడుదలైన తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.120 కోట్ల గ్రాస్, దేశంలో రూ.70 కోట్ల నెట్ కలెక్షన్లు (Jawan Collections) సాధించింది.

Published By: HashtagU Telugu Desk
Jawan Collections

Jawan

Jawan Collections: బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ (Shah Rukh Khan) నటించిన జవాన్ (Jawan) సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. విడుదలైన తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.120 కోట్ల గ్రాస్, దేశంలో రూ.70 కోట్ల నెట్ కలెక్షన్లు (Jawan Collections) సాధించింది. ఈ నెట్ కలెక్షన్లు దేశంలోనే తొలిసారని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. గతంలో పఠాన్ (57 కోట్లు), KGF 2(రూ.53.95 కోట్లు), వార్ (రూ. 53.35 కోట్లు), థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ (రూ.52.25 కోట్లు), బాహుబలి 2(రూ.41 కోట్లు) సాధించాయి.

Also Read: Raghava Lawrence : కమల్‌హాసన్‌ విక్రమ్ సినిమాలో ఆ పాత్రని రాఘవ లారెన్స్‌ చేయాల్సిందట..

షారుఖ్ ఖాన్ జవాన్ ఎట్టకేలకు మ్యాజిక్ చేసింది. ఈ సినిమా విడుదలైన తొలిరోజే బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. తొలిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా జవాన్ నిలిచింది. జవాన్ విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్‌లో భారీగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా తొలిరోజు పలు రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేసినట్లే జరిగింది. ఈ సినిమా ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జవాన్ హిందీతో పాటు సౌత్‌లోనూ మంచి వసూళ్లను రాబట్టింది.

దక్షిణాదిలో ప్రముఖ యాక్షన్ డైరెక్టర్ అట్లీ కుమార్ దర్శకత్వం వహించిన చిత్రం జవాన్. ఈ చిత్రం గౌరీ ఖాన్, షారూఖ్‌ల సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మించబడింది. జవాన్‌లో షారుఖ్ ఖాన్‌తో పాటు నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి, సన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్, రిద్ధి డోగ్రా కూడా నటించారు. వీరితో పాటు దీపికా పదుకొణె, సంజయ్ దత్ క్యామియో కూడా ఉంది.

  Last Updated: 08 Sep 2023, 08:52 AM IST