Site icon HashtagU Telugu

Sandeep Reddy Vanga: సందీప్ పై మరోసారి మండిపడిన జావెద్.. నన్ను ఏమి అనలేక నా కొడుకుని అంటున్నావంటూ?

Mixcollage 18 Mar 2024 09 24 Am 4660

Mixcollage 18 Mar 2024 09 24 Am 4660

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా పేరు కూడా ఒకటి. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యానిమల్ సినిమా ఇటీవల విడుదల అయ్యి మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో రన్బీర్ కపూర్ పోషించిన విజయ్ అనే పాత్ర విషపూరితమైన పురుషత్వాన్ని ప్రేరేపిస్తోంది అంటూ చాలా విమర్శలు వచ్చాయి. రచయిత జావేద్ అక్తర్ సైతం ఇలాంటి సినిమాలను ప్రమాదకరం అని అన్నారు.

అయితే ఈ కామెంట్స్ మీద సందీప్ ప్రతిస్పందిస్తూ.. అక్తర్ తన సినిమాపై వేళ్లు చూపించే ముందు తన కొడుకు ఫర్హాన్ అక్తర్ చేసే కంటెంట్ ను కూడా పర్యవేక్షించాలంtటూ షాకింగ్ కామెంట్స్ చేసారు. జావేద్ కొడుకు ఫర్హాన్ అక్తర్ నిర్మించిన మీర్జాపూర్ వెబ్ సిరీస్ లో ప్రపంచంలో ఉన్న బూతులు అన్నీ ఉన్నాయి. తెలుగులో అయితే అసలు ఆ సిరీస్ చూడలేకపోయాము. మరి తన కొడుక్కి ఎందుకు చెప్పలేదు? తన కొడుకుని ఎందుకు ఇలా విమర్శించలేదు అని కౌంటర్ ఇచ్చాడు. ఇదంతా జరిగిపోయి కూడా చాలా రోజులు అవుతుంది.

కానీ తాజాగా మళ్ళీ జావేద్ అక్తర్ యానిమల్ సినిమాపై, సందీప్ వ్యాఖ్యలపై కామెంట్స్ చేసాడు. జావేద్ అక్తర్ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను ఆ సినిమాని, డైరెక్టర్ ని ఏమి అనలేదు. అలాంటి సినిమాలు చూసే ప్రేక్షకుల గురించే నా ఆందోళన. ఎవరు ఎలాంటి సినిమా అయినా తీసుకునే హక్కు రాజ్యాంగం ఇచ్చింది. అయినా నేను సినిమా చూడలేదు. కొన్ని సీన్స్ చూసే ఆ కామెంట్స్ చేశాను. నా వ్యాఖ్యలకు సందీప్ స్పందించడం గౌరవంగా అనిపించింది. ఎందుకంటే నా 53 ఏళ్ళ కెరీర్ లో నేను రాసిన సినిమాలు, స్క్రిప్ట్స్, డైలాగ్స్, పాటల్లో ఎక్కడా ఒక్క అసభ్యతని కూడా సందీప్ చూపించలేకపోయాడు. ఇక నన్నేమి అనలేక నా కుమారుడి మీద పడ్డాడు. అది కూడా తన ఆఫీస్ నిర్మించిన సిరీస్ పై. నా దాంట్లో తప్పులు వెతకలేక నా కుమారుడిని కామెంట్ చేసాడు సందీప్ అని వ్యాఖ్యలు చేయడంతో ఇవి వైరల్ గా మారాయి.

Exit mobile version