Site icon HashtagU Telugu

Janvi Kapoor : సినిమా వాళ్లు డేటింగ్ కి పనికిరారా.. జాన్వీ కామెంట్స్ పై నెటిజెన్ల రియాక్షన్ ఇదే..!

Janvi Kapoor Interesting Comments On Dating

Janvi Kapoor Interesting Comments On Dating

శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ (Janvi Kapoor) ప్రస్తుతం పాన్ ఇండియా ఇమేజ్ మీద దృష్టి పెట్టింది. హిందీలో సినిమాలు చేస్తూ అలరిస్తున్న అమ్మడు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో కలిసి దేవర సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను కొరటాల శివ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. రైటర్ నుంచి డైరెక్టర్ గా మారిన కొరటాల శివ కెరీర్ లో మిర్చి నుంచి ఆచార్య ముందు వరకు ఒక్క ఫ్లాప్ కూడా అందుకోలేదు. అయితే ఆచార్య ఫ్లాప్ తో అతని మీద చాలా విమర్శలు వచ్చాయి. వాటిని కొరటాల శివ ఫేస్ చేయాల్సి వచ్చింది.

We’re now on WhatsApp : Click to Join

అందుకే ఎన్.టి.ఆర్ (NTR) కోసం ఒక అదిరిపోయే కథని రెడీ చేసి దేవరగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ చేయాలనే ప్లానింగ్ తో హీరోయిన్ గా కపూర్ బ్యూటీ జాన్వీ కపూర్ ని ఫిక్స్ చేశారు. సౌత్ సినిమాల్లో ముఖ్యంగా తెలుగు సినిమాల్లో జాన్వి నటిస్తున్న మొదటి సినిమా దేవర. ఈ సినిమాలో ఆమె నటనతో ఇక్కడ ఆడియన్స్ ని మంత్ర ముగ్ధుల్ని చేయాలని చూస్తుంది.

ఇదిలాఉంటే జాన్వీ కపూర్ డేటింగ్ గురించి చాలా కాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. బిజినెస్ మెన్ శిఖర్ వహారియా తో జాన్వీ కపూర్ డేటింగ్ లో ఉందని ముంబై మీడియా కోడై కూస్తుంది. కానీ జాన్వీ మాత్రం ఆ విషయంపై ఇప్పటివరకు నోరు విప్పలేదు. లేటెస్ట్ గా జాన్వీ కపూర్ కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొనగా అందులో తన డేటింగ్ ఇంట్రెస్ట్ గురించి బయట పెట్టింది జాన్వీ కపూర్.

తను డేటింగ్ చేయాలని అనుకుంటే బయట వ్యక్తులను చేస్తా కానీ సినిమా వాళ్లతో అసలు చేయనని అంటుంది. సినిమా వాళ్లకు అసలు టైం ఉండదు. వారికి పనితోనే సరిపోతుంది. కానీ తనతో డేటింగ్ చేసే వాడికి తానే ప్రపంచమై ఉండాలని అలాంటి వారితోనే తాను డేటింగ్ చేస్తానని అంటుంది జాన్వీ కపూర్. అయితే శిఖర్ వహారియా గురించి మాత్రం ప్రస్తావించకుండా తెలివిగా తప్పించుకుంది జాన్వీ కపూర్.

Also Read : Fighter: ఫైటర్ నుండి సాంగ్ రిలీజ్.. ఎయిర్ ఫోర్స్ పైలెట్ లుక్ లో “హృతిక్” రోషన్..!

సినిమా వాళ్లు కాదంటుంది అంటే శిఖర్ వహారియా తో తన లవ్ స్టోరీ దాదాపు కన్ఫర్మ్ చేసినట్టే అంటున్నారు నెటిజెన్లు. దేవర సినిమాతో తెలుగులో ఎలాగైనా టాప్ లేపబోతున్న జాన్వీ కచ్చితంగా ఇదే ఫాం ని తన తర్వాత సినిమాలకు కూడా కొనసాగిస్తుందని ప్రేక్షకులు విశ్వసిస్తున్నారు. దేవర విషయంలో ఎన్.టి.ఆర్ కొరటాల శివ ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. సినిమా తారక్ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుందని అంటున్నారు.